»   » సమంత నుంచి సూపర్బ్ ఫోటో, చూస్తే భలే ఉందే అంటారు

సమంత నుంచి సూపర్బ్ ఫోటో, చూస్తే భలే ఉందే అంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ మీడియాలో సమంత గత కొద్ది రోజులుగా హంగామా చేస్తోంది. ఓ రకంగా ప్రేమ, పెళ్లి సెట్ అయిన తర్వాత ఆమెలో వచ్చిన ఉత్సాహంతో చేస్తున్న పోస్ట్ లు అవి మనకు అర్దం అవుతూంటుంది.

సమంత ఫోటో గ్యాలరీ

తను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్యతో కలిసున్న ఫోటోలతో పాటు తన వర్క్ అవుట్స్ కు సంబందించిన వీడియోలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ రోజు ( ఆదివారం) కూడా తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోనూ పోస్ట్ చేసింది సమంత. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడండి.

#family

A photo posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on Nov 5, 2016 at 9:37pm PDT

సమంత, నాగచైతన్యలతో పాటు యంగ్ కపుల్ అఖిల్, శ్రేయా భూపాల్ లు కూడా కలిసి ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసిన సమంత, ఫ్యామిలీ అంటూ రాసింది. నిజమే కదా..అదే కదా ఆమె ప్యామిలీ.

Also See : సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

చైతు, సమంత కాస్త ఫ్రీ అయ్యారనే చెప్పాలి. అంతకు ముందు వరకు ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు.

కొద్ది రోజులు క్రితం...'అవి లేకపోతే నేను జీవించలేను అనే వాటిలో మూడు చెప్పండి' అని ఓ ఫ్యాన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'చైతూ, మస్కతీ ఐస్‌క్రీమ్‌, వర్క్‌' అని సమాధానమిచ్చింది సమంత.

Also See : అఖిల్ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ ఇదిగో (ఫొటో), అందులో ఏముంది

Samantha again posts a photo in FB

'చైతన్య ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోకూడదా?' అని ఓ అభిమాని అడిగాడు. దానికి స్పందిస్తూ 'చేసుకోకూడదు. ఎందుకంటే నేను నిన్ను 8 సంవత్సరాల క్రితం కలవలేదు. మనిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కాదు కదా' అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.

ఇక నాగచైతన్య మాట్లాడుతూ...'ఏమాయ చేసావే' సినిమా చేస్తున్పటి నుంచే సమంతతో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తమకు తెలియకుండానే 'బెస్ట్ ఫ్రెండ్స్'గా మారిపోయామని, ఆ స్నేహమే ఒకరిపై ఒకరికి మరింత ఇష్టాన్ని పెంచింది. తమది ఏ ఒక్కరోజులోనో పుట్టిన ప్రేమ కాదని చైతూ చెప్పుకొచ్చారు.

మేము ఇంతకాలం స్నేహం చేసామా? ప్రేమలో ఉన్నామా? అంటే చెప్పడం కష్టమే. మేము ఎప్పుడూ ఒకరికొకరం ప్రపోజ్ చేసుకోలేదు. 30 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు సమంత తప్ప మరే అమ్మాయని ఊహిచుకోలేకపోయాను అని చైతు తెలిపారు.

English summary
Samantha shared a photo with Akhil, naga Chaitanya and sherya Bhoopal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu