మామా అప్పటి వరకు ఆగలేకపోతోన్నా.. నాగ్‌పై సమంత కామెంట్స్ వైరల్
నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోను కూడా కాదనుకుని మధ్యలో బ్రేక్ ఇచ్చి మరీ మనాలిలో షూటింగ్‌కు వెళ్లాడు. అలాంటి నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఎలా ఉంటుందా? అని అందరూ అనుకున్నారు. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలిపారు. అయితే తాజాగా వదిలిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

చిరంజీవి చేతుల మీదుగా..
వైల్డ్ డాగ్ ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశాడు. కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా టీజర్‌ను విడుదల చేస్తూ.. మై బ్రదర్ నాగ్ అంటూ ఎంతో కూల్.. ఎప్పటిలానే అద్భుతంగా నటించేశాడు.. అన్ని జానర్స్‌ను టచ్ చేస్తుంటాడు.. అని ప్రశంసలు కురిపించాడు.

నాగ్ రియాక్షన్..
ఇక చిరంజీవి ప్రశంసలకు, తన ట్రైలర్‌ను విడుదల చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు నాగార్జున. ఈ మేరకు చిరంజీవి ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. మీరు చెప్పిన మాటలకు, నా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్యూ చిరంజీవి గారు.. అని చెప్పుకొచ్చాడు.

అదిరిపోయిన ట్రైలర్..
గోకుల్ చాట్ ఘటనలు, బాంబ్ పేలుళ్ల ప్రమాదాల ఆధారంగా వైల్డ్ డాగ్‌ను తెరకెక్కించారు. ఇక ఇందులో నాగ్ ఎనర్జీ, యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్, లొకేషన్స్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. చివర్లో నాగ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

సమంత కామెంట్స్..
వైల్డ్ డాగ్ ట్రైలర్ వీక్షించిన సమంత తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలాంటి వాటి గురించే మేం ఎదురుచూస్తోంది.. ఇంటెన్స్, రా అండ్ రియల్.. మామా.. ఏప్రిల్ 2 వరకు ఆగలేకపోతోన్నా అంటూ సమంత చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి మామ సినిమా కోసం కోడలు ఇలా ప్రమోషన్స్ కల్పించింది.


Click it and Unblock the Notifications











