నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
సమంతకు సోషల్ మీడియాకు విడదీయలేని బంధం ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయకుండా సమంత ఉండదు. వాటిపై ట్రోల్స్ చేయకుండా నెటిజన్లు ఆగరు. అలా సోషల్ మీడియాలో సమంతపై అప్పుడప్పుడు వ్యతిరేకపవనాలు వీస్తుంటాయి. ఒకప్పుడు సమంత ఎంత ఘాటుగా ట్రోలర్స్‌కు రిప్లై ఇచ్చిందో అందరికీ తెలిసిందే. సమంతపై ట్రోలింగ్ అంటే మామూలు విషయం కాదు. అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది.

సోషల్ మీడియాలో రచ్చ..
సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న సమంత.. అందాలను ఆరబోయడంలో హద్దులు చేరిపేస్తోన్నట్టు కనిపిస్తోంది. అలా సమంత వెరైటీ ఫోటో షూట్‌లు ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ప్రమోషన్స్‌లో సమంత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఆ ఫోటోతో చిచ్చు..
సమంత మూడు నాలుగు రోజుల క్రితం ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన డిజైనర్ ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టుకుని హాయిగా ముచ్చట్లు పెట్టేసింది. తాపీగా సోఫాలో కూర్చుని అలా ఒళ్లో కాలేసుకుని ముచ్చట్లు పెట్టడమే కాకుండా ఐలవ్యూ అంటూ పోస్ట్‌లుపెట్టేశారు.

వివాదం రేగింది..
సమంత షేర్ చేసిన ఆ ఫోటో పెద్ద దుమారానికే దారి తీసింది. అలా సమంత చేసిన తప్పును తెలుసుకుంది. వెంటనే ఆ పోస్ట్‌లను డిలీట్ చేసింది. దీని వెనుక పెద్ద కథే జరిగిందని టాక్. నాగార్జున చాలా సీరియస్ అవ్వడంతో సమంత అలా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

తాజాగా అలా..
అయితే సమంత ట్రోలింగ్ అనేవి రెండూ వేర్వేరు అంశాలేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. అప్పుడు ఓ సారి మహేష్ బాబు సినిమా పోస్టర్, బికినీ ధరించి బీచ్‌లో రచ్చ చేసిన ఫోటోల విషయంలో సమంతపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఆ సమయంలో గట్టిగానే ప్రతిఘటించింది. కానీ ఈ సారి మాత్రం అంతగా రియాక్ట్ అవ్వలేదు.
Recommended Video

ఇప్పుడు నవ్వొస్తుంది..
తాజాగా సమంత నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది. సోషల్ మీడియా, ట్రోలింగ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారని సమంతను అడిగితే ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఒకప్పుడు ట్రోలింగ్ వల్ల నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను.. కానీ ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంటుంది.. ట్రోల్ చేస్తున్నారంటే మనం ఎంతో సాధించేశామని అర్థమంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











