రైతుగా మారిన సమంత అక్కినేని.. ఏం పండిస్తున్నారో తెలుసా?

పెళ్లి తర్వాత అక్కినేని కోడలుగా మారిన సమంత సినిమాలు, సామాజిక సేవతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ, అలాగే తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుస విజయాలతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మారిపోయారు. భారీ బడ్జెట్, అగ్ర హీరోలతో జతకడుతున్న సమంత తాజాగా జీవితంలో మరో చక్కటి నిర్ణయం తీసుకొన్నారు. అదేమిటంటే..

 టెర్రస్‌పై కూరగాయలు పంట

టెర్రస్‌పై కూరగాయలు పంట

అందాల తార సమంత అక్కినేని కరోనా లాక్‌డౌన్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. భర్త నాగచైతన్యతో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ దాంపత్య జీవితంలో కొత్త అనుభూతులను పంచుకొంటున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా జీవితంలో కొన్ని మిగిలిన కోరికలను పూర్తి చేసుకొంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆమె కూరగాయలు పండించే రైతుగా మారిపోయారు.

మిద్దె పంట ద్వారా

మిద్దె పంట ద్వారా

సమంత, చైతులకు హైదరాబాద్‌లో అందమైన ఇల్లు ఉంది. ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉండటం తెలిసిందే. ఇక ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టే సమంత మిద్దె పంట ద్వారా లభించే కూరగాయలనే వంటకు ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలను ప్రారంభించారు. తాను మిద్దె పంట ద్వారా కూరగాయాలను పండిస్తున్నట్టు ఆమె తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

ఇతరులకు స్పూర్తిగా నిలిచే విధంగా

ఇతరులకు స్పూర్తిగా నిలిచే విధంగా


ఇలా ఇంటి పంటను చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలిచేందుకు సమంత కారణమవుతున్నారు. సమంత చేపట్టిన ఈ పనితో చాలా మంది మిద్దె తోటతో తమ ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను సమకూర్చుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటి పంటకు రాయితీలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Samantha Fans Demand Apologize From Pooja Hegde
సమంత కెరీర్ ఇలా..

సమంత కెరీర్ ఇలా..


సమంత కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన జాను చిత్రం తెలుగులో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కాతు వాకులా రెండు కాదల్ చిత్రంతోపాటు అశ్విన్ శరవణన్ సినిమాకు ఒకే చెప్పారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రూపొందించే కాతు వాకులా రెండు కాదల్ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించడానికి అంగీకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X