వందల కోట్ల రారాణి సమంత.. అనుష్క రికార్డు బ్రేక్.. దేవసేనకు రామలక్ష్మీ చెక్!
Recommended Video

దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో రాంచరణ్, సమంత అక్కినేని నటించిన రంగస్థలం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తున్నది. ఆ చిత్రంలో నటించిన నటీనటుల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
చిట్టిబాబుగా రాంచరణ్‌తో రామలక్ష్మీగా నటించిన సమంతకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత అతివేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రంగస్థలం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో సమంత ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నారు. అత్యధికంగా వంద కోట్ల క్లబ్‌లో చేరినట్టు అనుష్క పేరిట ఉన్న రికార్డును రామలక్ష్మీ తిరగరాసింది.

బాలీవుడ్ సినిమాకు షాక్
రంగస్థలం కలెక్షన్ల సునామీకి బాలీవుడ్ చిత్రం భాగీ2 కూడా చిన్నబోయింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికాలో అత్యధికంగా వసూలు చేస్తున్న టాప్ 10 చిత్రాల జాబితాలోకి రంగస్థలం చేరింది.

ఎనిమిది వంద కోట్ల చిత్రాలు
ఇదిలా ఉండగా, సమంతకు తన కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన 8వ చిత్రం రంగస్థలం కావడం విశేషం. ఈ ఏడాది రంగస్థలం సినిమా ద్వారా సమంత 100 కోట్ల క్లబ్‌లో మరోసారి చేరింది. రంగస్థలం సినిమా సమంత కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన 8వ చిత్రం అంటూ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

వందల కోట్ల రారాణిగా
సమంత నటించిన చిత్రాల్లో వంద కోట్ల చేరిన చిత్రాల్లో మెర్సల్, తెరీ, కత్తి, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, దూకుడు, 24 సినిమాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన రంగస్థలం సినిమా కూడా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. దాంతో వందల కోట్ల రారాణిగా కీర్తించబడుతున్నది

అనుష్క రికార్డు బ్రేక్
గతంలో అత్యధికంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్‌గా అనుష్క శెట్టి పేరు మీద ఓ రికార్డు ఉంది. ఆ రికార్డును గతంలోనే సమంత తిరుగారాసినప్పటికీ.. తాజాగా రంగస్థలం సినిమాతో మరో మెట్టు ఎగబాకింది.

రంగస్థలం సక్సెస్‌లో
రంగస్థలం సక్సెస్‌ను ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే.. భర్త నాగచైతన్యతో అమెరికాలో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సమంత. త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చి రంగస్థలం విజయోత్సవంలో పాలుపంచుకొనే అవకాశం ఉంది.

చేతి నిండా సినిమాలే
అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా సమంత కెరీర్ గ్రాఫ్ పైపైకి దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మహానటి చిత్రంలో, విశాల్‌తో ఇరుంబు థిరై, విజయ్ సేతుపతితో సూపర్ డీలక్స్, శివకార్తీకేయన్‌తో సీమరాజా చిత్రాల్లో నటిస్తున్నది. అలాగే స్వీయ నిర్మాణ సారథ్యంలో కన్నడ చిత్రం యూటర్న్ రీమేక్‌లో సమంత నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











