సమంత కీలక ప్రకటన: సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అక్కినేని సమంత కొంత ప్రత్యేకమనే చెప్పాలి. 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఆమె.. తక్కవ వ్యవధిలోనే ఊహించని రీతిలో ఫాలోయింగ్ పెంచుకుంది. అదే సమయంలో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ భారీగా రెమ్యూనరేషన్ ఆర్జించింది. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బీజగా గడిపిన ఈ అమ్మడు.. ఈ మధ్య సినిమాలను తగ్గించేసింది. ఈ నేపథ్యంలో ఆమె కీలక ప్రకటన చేసింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అందరూ దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏంటా సర్‌ప్రైజ్.? వివరాల్లోకి వెళితే....

ఇక్కడా అక్కడ.. వరుసగా కొట్టేసిన సమంత

ఇక్కడా అక్కడ.. వరుసగా కొట్టేసిన సమంత

అక్కినేని వారి కోడలు సమంత సూపర్ ఫామ్‌లో ఉంది. త్రివిక్రమ్ - నితిన్ కాంబోలో వచ్చిన ‘అఆ' మూవీ నుంచి ఆమె వరుసగా ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే, కోలీవుడ్‌లోనూ ఆమె ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్' వంటి వరుస విజయాలను అందుకుంది.

హిట్ సినిమాతో వస్తే.. ఫలితం ఇలా ఉంది

హిట్ సినిమాతో వస్తే.. ఫలితం ఇలా ఉంది

సమంత - శర్వానంద్ కాంబినేషన్‌లో ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘జాను'. తమిళం చిత్రం ‘96'కు రీమేక్‌గా రూపొందిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా బాగానే రాణించింది. మొదటి రోజు రూ. 16 కోట్ల వరకు రాబట్టింది.

సమంతకు వాళ్లంతా ఫిదా.. ప్రశంసల వర్షం

సమంతకు వాళ్లంతా ఫిదా.. ప్రశంసల వర్షం

‘జాను' ఫలితం ఎలా ఉన్నా.. ఇందులో నటనకు గానూ సమంత నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఆమె చేసిన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. దీంతో అక్కినేని కోడలిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే, ఈ మూవీలోని హీరో శర్వానంద్ కూడా ఎప్పటి లాగే అదరగొట్టేశాడని చెప్పాలి.

సమంతకు మిగిలింది అదొక్కటి మాత్రమే

సమంతకు మిగిలింది అదొక్కటి మాత్రమే

ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాలేవీ లేవు. కానీ, ఆమె డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టబోతున్న వెబ్ సిరీస్ మాత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్'కు ఇది కొనసాగింపుగా వస్తోంది. ఈ సిరీస్‌ను తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కిస్తున్నారు.

సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు

సర్‌ప్రైజ్ రివీల్ చేసిన అక్కినేని కోడలు

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడింది. ‘నా కెరీర్‌లోనే మొదటిసారి నేను విలన్‌గా నటిస్తున్నాను. అందులో నన్ను చాలా కొత్తగా చూస్తారు. ఈ పాత్ర కోసం నేను డూప్ లేకుండా స్టంస్ట్స్ చేశాను. అది సిరీస్ చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది' అని ఆమె కీలక ప్రకటన చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ వెబ్ సిరీస్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తల్లినవడంపైనా స్పందించిన సామ్

తల్లినవడంపైనా స్పందించిన సామ్

ఇటీవల జరిగిన ‘జాను' ప్రమోషన్ కార్యక్రమంలోనే సమంత తన భవిష్యత్ ప్రణాళికపై మాట్లాడిన విషయం తెలిసిందే. ‘నాకు ఇప్పుడు ఓ కుటుంబం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇంకో రెండు మూడేళ్లే సినిమాల్లో నటిస్తానేమో. ఆ తర్వాత మాత్రం నా కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X