అందరూ ఉండటంతో పవన్ కళ్యాణ్ సిగ్గుపడ్డారు.. నాకు నవ్వొచ్చింది.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

Recommended Video

Samantha Reveals Funny Incident About Pawan kalyan

నేటితరం యంగ్ హీరోయిన్స్ అందరిలో మోస్ట్ యాక్టివ్ ఎవరంటే ముందుగా చెప్పే పేరు సమంతనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వెండితెరపై ఫుల్ జోష్‌లో సినీ జర్నీ చేస్తున్న ఈ భామ.. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించింది. ముఖ్యంగా తెలుగులో మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి యంగ్ స్టార్స్ అందరితో జతకట్టిన ఈమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. వివరాల్లోకి పోతే..

అక్కినేని సమంత జోష్.. పెళ్ళికి ముందు నుంచే

అక్కినేని సమంత జోష్.. పెళ్ళికి ముందు నుంచే

పెళ్ళికి ముందే సౌత్ ఇండియన్ తెరపై స్టార్ స్టేటస్ కొట్టేసింది సమంత. ఆ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా షూట్ చేస్తున్నప్పటి కొన్ని విశేషాలు పంచుకుంది సమంత.

అందరూ పవర్ స్టార్ అనుకుంటారు.. కానీ

అందరూ పవర్ స్టార్ అనుకుంటారు.. కానీ

పవన్ కళ్యాణ్‌ని చూసి అంతా పవర్ స్టార్ అనుకుంటారు.. కానీ అతనికి నిజ జీవితంలో సిగ్గు ఎక్కువ అని చెప్పుకొచ్చింది సమంత. ఎక్కువ మందిలో డాన్స్ చేయాలంటే ఆయన తెగ సిగ్గుపడుతుంటారని తెలిపింది. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్‌లో అదే జరిగిందని ఆ సందర్భాన్ని వివరించింది సమంత.

చుట్టూ జనం.. పవన్ పారిపోయాడు

చుట్టూ జనం.. పవన్ పారిపోయాడు

అత్తారింటికి దారేది సినిమా షూటింగ్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌ వెళ్లామని, అక్కడ ఓ పాట షూట్ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ సిగ్గు చూసి తనకు నవ్వొచ్చిందని తెలిపింది సామ్. అక్కడి లొకేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నపుడు చుట్టూ జనం ఉన్నారని, దీంతో వాళ్ళందరి మధ్యలో నేను స్టెప్ వేయనని పవన్ క్యారవాన్ వద్దకు పారిపోయారని చెప్పింది.

ఈయన పవర్ స్టారా? అని నవ్వొచ్చింది

ఈయన పవర్ స్టారా? అని నవ్వొచ్చింది

ఆ సమయంలో పవన్ వద్దకు త్రివిక్రమ్ వెళ్లి యూ కమ్, నీవు చేయగలవు అని ఎంకరేజ్ ఇవ్వడం, అవునా! నేను చేయగలనా? అని పవన్ అంటుండటం చూసి తనకు నవ్వొచ్చిందని చెప్పుకొచ్చింది సమంత. ఇంత సింపుల్ మెంటాలిటీ ఉంది ఈయన పవర్ స్టారా? అనుకున్నానని చెప్పిన ఆమె.. పవన్ సింప్లిసిటీయే తనకు ఇష్టమని, పవన్ నుంచి ఇంప్రెషన్‌గా అదే తీసుకుంటానని తెలిపింది.

ప్రస్తుతం సమంత..

ప్రస్తుతం సమంత..

ఇటీవలే ఓ బేబీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X