బాగా ఎంజాయ్ చేశా.. ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు కూడా: అక్కినేని సమంత

అక్కినేని సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో మోస్ట్ యాక్టివ్ హీరోయిన్. పెళ్ళికి ముందే స్టార్ స్టేటస్ కేట్టేసిన ఈ అమ్మడు నాగ చైతన్యతో వివాహం తర్వాత సినీ కెరీర్ మరింత స్ట్రాంగ్ చేసేసింది. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న ఈమె తాజాగా సాహో హీరోయిన్ శ్రద్ద కపూర్ కొత్త సినిమాపై కామెంట్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దామా..

సోషల్ మీడియా క్వీన్ సమంత

సోషల్ మీడియా క్వీన్ సమంత

సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ యమ యాక్టివ్‌గా ఉండటం సమంత స్టైల్. ఈ వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబందించిన విశేషాలు, అలాగే అక్కినేని కుటుంబ సంగతులు, సినిమాలకు సంబందించిన అప్‌డేట్స్ ఇస్తూ టచ్‌లో ఉంటుంది సమంత. ఈ నేపథ్యంలో తాజాగా శ్రద్ద కపూర్ కొత్త సినిమా 'చిచ్చోరె' గురించి ఆసక్తికర కామెంట్ చేసింది.

సాహో భామ శ్రద్దా కపూర్ 'చిచ్చోరె'

సాహో భామ శ్రద్దా కపూర్ 'చిచ్చోరె'

భారీ సినిమా 'సాహో' రూపంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్. సాహో తెరకెక్కుతుండగానే ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్‌లో
'చిచ్చోరె' మరో సినిమా చేసింది శ్రద్దా. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించాడు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తోంది.

బాగా ఎంజాయ్ చేశా.. ఇంత నవ్వు ఎప్పుడూ రాలేదు

బాగా ఎంజాయ్ చేశా.. ఇంత నవ్వు ఎప్పుడూ రాలేదు

శ్రద్దా కపూర్ 'చిచ్చోరె' సినిమాను చూశానని పేర్కొన్న సమంత.. ఈ సినిమా చూస్తూ బాగా ఎంజాయ్‌ చేశానని తెలిపింది. అమేజింగ్‌ మూవీ అని.. ఎన్నో రోజుల తర్వాత తర్వాత సినిమా చూస్తూ ఇంతగా నవ్వానని పేర్కొంది. ఈ సినిమా ద్వారా కొంత నేర్చుకున్నానని కూడా చెప్పింది సమంత. ఇదంతా తన ఇన్స్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పెట్టుకుంది.

సమంత సినిమా జర్నీ

సమంత సినిమా జర్నీ

ఇటీవలే ఓ బేబీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తోందని సమాచారం.

సమంత ఫ్యామిలీ ట్రిప్

సమంత ఫ్యామిలీ ట్రిప్

ఇటీవలే సమంత ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసింది. భర్త నాగ చైతన్య సహా అక్కినేని కుటుంబమంతా కలిసి స్పెయిన్‌లో షికారు చేశారు. నాగార్జున పుట్టినరోజు పురస్కరించుకొని స్పెయిన్ వెళ్లిన సామ్ అండ్ ఫ్యామిలీ ఓ వారం పాటు అక్కడే విహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X