అమలాపాల్ న్యూడ్ లుక్‌పై సమంత సెన్సేషనల్ కామెంట్

Recommended Video

Samantha Akkineni Comments On Amala Paul's Aame Teaser || Filmibeat Telugu

హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్ర 'ఆమె'. తమిళంలో ఇదే చిత్రాన్ని 'ఆడై' పేరుతో తెరకెక్కిస్తున్నారు. వీ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సమాజంలో మహిళల స్వేచ్ఛ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఈ సినిమా టీజర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే ఈ టీజర్ లో అమలాపాల్ లుక్ పై పలు విమర్శలు వచ్చినప్పటికీ టాలీవుడ్ హీరోయిన్ సమంత మాత్రం షాకింగ్ కామెంట్ చేసింది.

నగ్నంగా అమలాపాల్

తాజాగా విడుదలైన 'ఆమె' టీజర్ లో హీరోయిన్ అమలాపాల్ నగ్నంగా దర్శనమిచ్చింది. తన కూతురు రాత్రి ఇంటికి రాలేదని, ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం కోసం పోలీసులను ఆ తల్లి పోలీసులను ఆశ్రయించడం ఆసక్తికరంగా చూపించారు. అయితే అమలాపాల్ కోసం అన్వేషిస్తున్న పోలీసులకు ఆమె నగ్నంగా కనిపించడం ఈ సినిమాపై అమితమైన ఆస్కతి నెలకొల్పుతోంది.

టీజర్ పై విమర్శలు.. సమంత స్పందన

'ఆమె' సినిమా టీజర్ చూసిన నెటిజన్లు అమలాపాల్ నగ్నత్వంపై విరుచుకు పడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా న్యూడ్ గా కనిపించడమేంటంటూ సిసిల మీడియాలో అసభ్యకర కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా హీరోయిన్ సమంత చేసిన కామెంట్ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది.

సమంత ఏమందంటే..

సమంత ఏమందంటే..

'ఆమె' చిత్ర టీజర్ చాలా బాగుంది. అమలాపాల్ లుక్స్ అమేజింగ్. ఆలా ది బెస్ట్.. ఉత్కంఠ రేపేశావు.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది అంటూ తన ట్వీట్ లో సమంత పేర్కొంది. ఓ హీరోయిన్‌ని నటనలో భాగంగానే చూడాలే తప్ప వేరే రకంగా చూడకూడదని ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పింది సమంత.

సమంత బిజీ బిజీ

సమంత బిజీ బిజీ

ప్రస్తుతం సమంత తన కొత్త సినిమా 'ఓ బేబీ' తో బిజీగా ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత విలక్షణ పాత్ర పోషిస్తోంది. తన కెరీర్ లోనే ఓ డిఫెరెంట్ మూవీగా ఓ బేబీ నిలుస్తుందని సమంత అంటోంది. అలాగే మామ నాగార్జున హీరోగా వస్తున్న మన్మథుడు 2 చిత్రంలో కూడా సామ్ కీలక పాత్ర పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X