ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా.. దురదృష్టం అలా వెంటాడిది.. మాన్య పోస్టుపై సమంత ఎమోషనల్
ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణించడం సులభం, పేదరికం అడ్డు కాదనే విషయం మరోసారి నిరూపించారు ఇద్దరు అమ్మాయిలు. పేదరికంతో బాధపడుతున్న తెలంగాణ యువతి మానస వారణాసి ఒకరైతే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌లోని ఆటో డ్రైవర్ కూతురైన మాన్య సింగ్ మరొకరు. వీరిద్ధరి భావోద్వేగమైన జీవన పరిస్థితులపై సమంత ఎమోషనల్‌గా స్పందిస్తూ...

ఆటో డ్రైవర్ కూతురు మిస్ ఇండియా రేసులో
ఆటో డ్రైవర్ కూతురు మాన్య సింగ్ తన సక్సెస్ ఫుల్ జీవిత ప్రయాణంపై ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నా రక్తాన్ని, చెమటను, కన్నీళ్లను కలిపి నా కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆహారం, నిద్ర లేకుండా ఆకలి, బాధతో మా కుటుంబమంతా కొన్ని రాత్రులు గడిపాం. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇతరుల ఇంటిలో పని మనిషిగా చేయడం వల్ల స్కూల్ వెళ్లలేకపోయాను. చదువుకోలేకపోయాను అంటూ తన పోస్టులో మాన్య సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ నగలు అమ్మి ఫీజు
నా బాల్యంలో సరైన దుస్తులు లేకపోయేవి. పుస్తకాలు కొందరిని అడిగి తెచ్చుకొన్నాను. ఏ దశలోనూ నాకు అదృష్టం కలిసి రాలేదు. మా అమ్మకు కొన్ని నగలు అమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టాం. అలా నేను డిగ్రీ సాధించాను. నా కోసం మా అమ్మ చాలా కష్టపడింది అంటూ మాన్య సింగ్ పేర్కొన్నారు.

సాయంత్రం పనిమనిషిగా.. రాత్రి కాల్ సెంటర్‌లో
కష్టాలను అధిగమించి ఎలాగోలా నా డిగ్రీ పూర్తి చేశాను. సాయంత్రం పూట కొందరి ఇళ్లలో అంట్లు తోమి డబ్బుల సంపాదించాను. రాత్రి వేళ కాల్ సెంటర్లో పనిచేశాను. ఓ దశలో డబ్బులు లేకపోతే కిలో మీటర్లు నడిచి వెళ్లే దానిని అంటూ మాన్య సింగ్ తన జీవితంలో ఎదురైన కష్టాలను వెల్లడించారు.

సమంత భావోద్వేగంతో పోస్ట్
మాన్య సింగ్ పోస్టు చూసిన సమంత అక్కినేని ఎమోషనల్ అయ్యారు. మాన్య పోస్టును షేర్ చేస్తూ.. ఇమాజిన్. క్రియేట్. ఇన్‌స్పైర్ అంటూ సమంత ట్వీట్ చేశారు. కష్టాలను ఎదురించి కలను సాకారం చేసుకొన్న మాన్య సింగ్‌కు అమీ జాక్సన్, వరుణ్ ధావన్ లాంటి ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Recommended Video

మానస, మాన్య గురించి
తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలకు ఎంపికయ్యారు. ఇక మాన్య సింగ్‌ను రన్నరప్‌గా ప్రకటించారు. ఈ ఇద్దరు తమ ప్రతిభ ఇప్పుడు అందరి హృదయాలను గెలచుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











