కాదనను.. కానీ!, సమంత ఎమోషనల్.. ఏడేళ్లయినా వెంటాడుతోంది..

విజయశాంతి తన కెరీర్‌లో ఎన్ని చిత్రాలు చేసినా.. 'రాములమ్మ' పాత్రనే జనం ఎక్కువగా గుర్తుంచుకున్నారు. అలాగే అనుష్క ఎన్ని చిత్రాల్లో నటించినా.. ఆమె కెరీర్‌లో 'జేజమ్మ' పాత్ర ఎప్పటికీ స్పెషలే. ఇలా ప్రతీ హీరో, హీరోయిన్ కెరీర్ లో కొన్ని గుర్తుండిపోయే పాత్రలు ప్రేక్షకులను ఎప్పుడూ వెంటాడుతుంటాయి.

హీరోయిన్ సమంత కెరీర్ లోను అలా గుర్తుండిపోయే పాత్ర జెస్సీ. ఏం మాయ చేశావె సినిమాలో జెస్సీ పాత్రలో ఆమె చేసిన మాయ చాలామంది అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. అయితే ఆ పాత్రపై అభిమానులు చూపిస్తున్న అభిమానం తనను సందిగ్ధంలో పడేసింది అంటున్నారు సమంత. ఇంతకీ ఏంటా సందిగ్ధం..

 సమంత ఇంటరాక్షన్:

సమంత ఇంటరాక్షన్:

సోషల్ మీడియాలో సమంత అభిమానులతో తరుచుగా ఇంటరాక్ట్ అవుతుంటారు. వాళ్లడిగే ప్రశ్నలకు.. ఇచ్చే సూచనలకు పాజిటివ్ గా స్పందిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే తరహాలో ఇటీవల మరోసారి ఆమె అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు ప్రస్తావించిన కొన్ని విషయాలు ఆమెకు సంతోషాన్ని, అదే సమయంలో బాధనూ కలిగించాయట.

 కాదనను.. కానీ!:

కాదనను.. కానీ!:

సమంత అభిమానులు ఏం మాయ చేశావె గురించి ప్రస్తావించడంతో ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. 'ఏడేళ్ల క్రితం చేసిన ఆ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్, కాదనను. కానీ ఆ తర్వాత నేను ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఎందుకు ఆ సినిమా గురించే పదే పదే మాట్లాడుతున్నారు.' అంటూ భావోద్వేగంతో వాపోయారు సమంత.

ఆనందించాలా?.. బాధపడాలా?:

ఆనందించాలా?.. బాధపడాలా?:

ఏడేళ్ల క్రితం చేసిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ఓవైపు ఆనందంగానే ఉందని.. అయితే ఆ తర్వాత చేసిన సినిమాల గురించి మాట్లాడట్లేదంటే.. అందులో నేనంత బాగా యాక్ట్ చేయలేదా? అని సమంత ఆవేదన చెందుతున్నారట.

 'జెస్సీ' వెంటాడుతోంది?:

'జెస్సీ' వెంటాడుతోంది?:

సమంత చెప్పినట్లు 'ఏం మాయ చేశావె' సినిమా అటు సమంత, ఇటు నాగచైతన్య కెరీర్‌లో వెరీ వెరీ స్పెషలే. జెస్సీ పాత్రలో అభిమానులు ఆమెనూ అంతగా ఓన్ చేసుకున్నారు.

కాబట్టే.. సమంత అంటే వాళ్లకు ఇప్పటికీ జెస్సీని గుర్తొస్తుంది. జెస్సీని మరిపించే మరేదైనా పాత్ర చేస్తే తప్పితే.. ఇప్పట్లో సమంత ఆ ముద్ర నుంచి బయటపడటం కష్టమే. అప్పటిదాకా అభిమానులు 'జెస్సీ'ని గుర్తు చేస్తూనే ఉంటారు.

 వరుస సినిమాలు:

వరుస సినిమాలు:

ప్రస్తుతం సమంత చేస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాది వరుసగా విడుదలకు సిద్దమయ్యాయి. ఇందులో తమిళ చిత్రం 'ఇరుంబుదరై' జనవరి 26న, తెలుగులో చేస్తున్న 'మహానటి' మార్చి 29న, రాంచరణ్ 'రంగస్థలం' మార్చి 30న విడుదలకు సిద్దమవుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో సమంత మూడు సినిమాలు విడుదలకు సిద్దమవుతుండటంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X