twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్‌లో ఎంజాయ్ చేసిన సమంత.. ఆయన ఎంకరేజ్ చేస్తుంటే మరింతగా.. వీడియో వైరల్

    |

    టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తెగ ఎంజాయ్ చేస్తోంది. అది కూడా విదేశాల్లోని పబ్‌లో. పక్కనే నాగ చైతన్య కూడా ఉన్నాడు. పబ్‌లో హోరెత్తుతున్న సాంగ్స్ నడుమ ఈ ఇద్దరి హుషారు రెట్టింపయింది. ఆ సమయాన్ని ఫుల్ జాలీగా గడిపేశారు చైతూసమంత. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది? ఎక్కడి పబ్‌లో ఈ ఇద్దరు ఇంత జోష్ లో ఉన్నారు? వివరాల్లోకి పోతే..

    అక్కినేని వారంతా అక్కడే.. జాలీ జాలీగా

    అక్కినేని వారంతా అక్కడే.. జాలీ జాలీగా

    గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగార్జున సహా నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌, అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది సమంత.

    పబ్‌లో ఎంజాయ్ చేస్తూ సామ్.. పక్కనే ఆయన కూడా

    పబ్‌లో ఎంజాయ్ చేస్తూ సామ్.. పక్కనే ఆయన కూడా

    ఈ కోవలోనే భర్త నాగచైతన్యతో కలిసి పబ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానుల ముందుంచింది సమంత. ‘వి విల్ వి విల్ రాక్ యు' అనే ఫోక్ సాంగ్ పై సమంత హుషారుగా డాన్స్ చేస్తుండగా.. పక్కనే ఉన్న నాగచైతన్య ఆమెకు కోరస్ ఇస్తుండటం ఈ వీడియోలో చూడొచ్చు.

    అక్కినేని అభిమానులు ఫిదా.. ట్రోల్స్ కూడా

    భర్త నాగచైతన్యతో సమంత ఇలా పబ్‌లో ఎంజాయ్ చేయడం చూసి కొందరు అక్కినేని అభిమానులు ఫిదా అవుతుండగా, మరికొందరు సమంత తీరును తప్పుబడుతూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఫోటోలు, వీడియోలతో సమంత ట్రోల్స్ బారిన పడిన సంగతి తెలిసిందే.

    టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా

    టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా

    ఇదే కోణంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సమతా ఎప్పుడూ ముందే ఉంటుంది సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్‌గా ఉండే ఈమె ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందట. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందని సమాచారం.

    English summary
    Tollywood Senior Hero Nagarjuna is turning 60 on August 29th this year. The actor will be celebrating this occasion which was planned especially to make it a memorable one. Chaitu and Akhil planned Nag’s 60th birthday in Ibiza, Spain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X