సమంతకు షాక్.. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు లీక్.. మొన్న త్రిష.. ఇప్పుడు ఆమె.. అచ్చం అలాగే..

Recommended Video

Samantha Akkineni’s Exclusive First Look As She Shoots For Telugu Remake Of 96 || Filmibeat Telugu

అక్కినేని వారి కోడలు సమంత దూకుడును ప్రదర్శిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు పచ్చ జెండా ఊపేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటోంది. ఆమె నటించిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కలెక్షన్లనూ భారీగానే సాధించింది. ఇదే ఉత్సాహంతో సమంత మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో సమంతకు ఊహించని షాక్ తగిలింది.

‘96' షూటింగ్ పిక్స్

‘96' షూటింగ్ పిక్స్

‘ఓ బేబీ' విడుదలై నెల రోజులు కూడా కాకముందే సమంత మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. అదే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96' రీమేక్. ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మాత‌ృకను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ రూపొందిస్తున్నారు. దీన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.

ఫొటోలు లీక్

ఫొటోలు లీక్

ఈ సినిమా షూటింగో.. లేక ఫొటో షూటో తెలియదు కానీ, సమంత ఫొటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఇవి వైరల్ అయిపోయాయి. ఇందులో సమంత.. ‘96' తమిళ సినిమాలో త్రిష ఎలా కనిపించిందో.. అదే గెటప్‌లో ఉంది. అంతేకాదు, అచ్చం త్రిషలానే కనిపిస్తోంది.

కథలో మార్పులు లేకుండానే..

కథలో మార్పులు లేకుండానే..

ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ సినిమా రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథలో మార్పులు చేయకుండానే తెలుగులోకి అనువాదం చేస్తున్నారట. అయితే, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కొన్ని మార్పులు ఉంటాయని టాక్.

నానిని అనుకుని శర్వాను తీసుకున్నారు

నానిని అనుకుని శర్వాను తీసుకున్నారు

‘96' సినిమా గురించి తెలుగు వాళ్లకు తెలిసినప్పుడు ఇందులో నేచురల్ స్టార్ నాని నటిస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. అంతేకాదు, ఈ సినిమా అతడే చేస్తున్నాడని కూడా ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో శర్వాను తీసుకున్నారు. అలాగే, త్రిష పాత్ర కోసం పలు పేర్లు తెరపైకి వచ్చినా.. సమంతను కన్ఫార్మ్ చేశారు.

 ‘96' గురించి..

‘96' గురించి..

త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘96' త‌మిళ‌నాట సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో చిన్నప్పుడు ఓ బాలుడు, అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ, అది చెప్పడానికి భయపడతాడు. తర్వాత ఇద్దరూ విడిపోతారు. కానీ, గెట్ టుగెదర్ పార్టీ కోసం ఇద్దరూ మరోసారి కలుస్తారు. అప్పుడు ఏం జరిగిందనేదే చిత్ర కథ. ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష నటనకు భారీ స్పందన వచ్చింది.

 ‘ఓ బేబీ' సక్సెస్

‘ఓ బేబీ' సక్సెస్

నందినీ రెడ్డి దర్శకత్వంలో స‌మంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'. ఇందులో ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X