నా గురించి ఆలోచిస్తున్నావా?.. నాగచైతన్య పోస్ట్‌పై సమంత ఫన్నీ కామెంట్స్

సమంత సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సమంత వేసే పంచ్‌లు, ఇచ్చే కౌంటర్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. మీమ్స్, ట్రోల్స్‌పైనా సమంత స్పందిస్తుంది. మామూలుగా నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్‌కు కాస్త ఘాటుగానే రిప్లై ఇస్తుంది. ఇక ఫన్నీ ట్రోల్స్‌కు మాత్రం అందరినీ నవ్వించేలానే రిప్లై ఇస్తుంటుంది. ఇక నాగ చైతన్య చేసే పోస్ట్‌లపై మాత్రం అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటుంది.

 ఫన్నీ కామెంట్లు..

ఫన్నీ కామెంట్లు..

నెటిజన్లు వేసే కౌంటర్లు, ట్వీట్లు, మీమ్స్‌కు సమంత ఎంతలా రియాక్ట్ అవుతుంది.. ఎలాంటి సెటైర్లు వేస్తుందో అందరికీ తెలిసిందే. తన పెళ్లిపై వచ్చిన మీమ్, సినిమాలపై వచ్చిన సెటైర్లపై సమంత కూడా అదే స్టైల్‌లో రిప్లై ఇస్తుంటుంది. మరీ ముఖ్యంగా నాగ చైతన్యకు సంబంధించిన వాటిపై స్పెషల్‌గా స్పందిస్తుంది.

 పెళ్లి చేసుకుందామా?..

పెళ్లి చేసుకుందామా?..

ఆ మధ్య నాగ చైతన్య, సమంతలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యారు. సమంత చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్ స్పందిస్తూ.. చైని వదిలేసిరా మనం పెళ్లి చేసుకుందాం అని సమంతను అడిగేశాడు. దానికి సమంత స్పందిస్తూ.. చై ఒప్పుకుంటాడా? మరి అంటూ ఫన్నీ కామెంట్ చేసింది.

 ఆ మధ్య అలా..

ఆ మధ్య అలా..

లవ్ స్టోరీ సినిమాలోని ఏయ్ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూపై సమంత వెరైటీగా స్పందించింది. ఆ టీజర్‌ చివర్లో సాయి పల్లవి చైని ముద్దు పెట్టేసుకుంటుంది. దానిపై కౌంటర్ వేస్తూ.. 'ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ బాగుంది.. ఆ లాస్ట్ షాట్ మాత్రం నా మైండ్‌లో కొద్ది రోజులు అలానే ఉండిపోతుంది' అంటూ ముద్దు సీన్‌పై సమంత స్పందించింది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

నాగ చైతన్య ఇప్పుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తోన్న థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మద్యే శిరీష్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్‌ను థ్యాంక్యూ మూవీ సెట్‌లో సెలెబ్రేట్ చేశారు. అప్పుడు థ్యాంక్యూ మూవీ వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ మూవీలోని ఓ స్టిల్‌ను పీసీ శ్రీరామ్ షేర్ చేశాడు.

నా గురించేనా?

నా గురించేనా?

ఏదో ధీనంగా ఆలోచిస్తూ ఉన్న నాగచైతన్యను పీసీ శ్రీరామ్ బంధించాడు. సినిమాలోని ఆ సీన్‌ను, నాగచైతన్యను అలా అందంగా బంధించడంతో ఫోటో బాగానే వైరల్ అయింది. ఆ ఫోటోను చైతు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి సమంత స్పందిస్తూ.. నా గురించే ఆలోచిస్తున్నావా? అని ఫన్నీ కామెంట్ వేసింది. దీనిపై ఓ సెటైరికల్ మీమ్ రాగా.. దాన్ని షేర్ చేస్తూ సమంత నవ్వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X