తప్పు చేయలేదని తెలిసింది.. కంటతడి పెట్టుకున్నా: సమంత అక్కినేని

Recommended Video

Samantha Emotional At Oh Baby Success Meet || Filmibeat Telugu

సమంత లీడ్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓ బేబీ సినిమా అంచనాలను అధిగమించి రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా అందించిన విజయోత్సాహంలో ఓ బేబీ టీమ్ విజయవాడలో థాంక్స్ మీట్ నిర్వహించింది. ఆ వివారాలు చూస్తే..

దుర్గమ్మను దర్శించుకున్న సమంత, నందినీ రెడ్డి

దుర్గమ్మను దర్శించుకున్న సమంత, నందినీ రెడ్డి

విజయవాడలో జరిగిన థాంక్స్ మీట్‌కి హాజరైన ఓ బేబీ టీమ్ అక్కడి దుర్గామాతను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుంది. హీరోయిన్ సమంతతో పాటు దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు తేజ, ఇతర యూనిట్ సభ్యులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమె ఆశీస్సులతోనే ఓ బేబీ సక్సెస్ సాధించిందని, ఇందులో మీరంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని నందినీ రెడ్డి తెలిపింది.

నందినీలోనే ఓ బేబీ ఉంది.. సమంత

నందినీలోనే ఓ బేబీ ఉంది.. సమంత

విజయవాడలో జరిగిన సమావేశంలో వేదికపై మాట్లాడిన సమంత డైరెక్టర్ నందినీ రెడ్డిని తెగ పొగిడేసింది. నందినీలోనే ఓ బేబీ అక్క ఉందని, తనకు తెలిసి ఆవిడ కంటే మంచిగా ఈ సినిమా ఎవరూ తీయలేరని సామ్ పేర్కొంది. ఈ రోజు ఓ బేబీ టీమ్ ఇంత హ్యాపీగా ఉందంటే ప్రేక్షకులు, మీడియా ఇచ్చిన సపోర్టే కారణమని సమంత చెప్పింది.

తప్పు చేయలేదనే నమ్మకం వచ్చింది.. భయపడ్డాం

తప్పు చేయలేదనే నమ్మకం వచ్చింది.. భయపడ్డాం

ఈ సినిమా రూపొందించే సమయంలో యూనిట్ అందరం రిస్క్ చేస్తున్నామేమో అని భయపడ్డామని సామ్ చెప్పింది. అయితే ఓ బేబీ రిలీజ్ తర్వాత ఆ భయం పోయి శాటిస్ఫాక్షన్ వచ్చిందని, ఓకే మేము తప్పు చేయలేదనే నమ్మకం వచ్చిందని ఆమె తెలిపింది. ఓ బేబీ సినిమా విడుదలకు ముందు మేము బాగా ప్రమోట్ చేశాం కానీ.. విడుదలయ్యాక మీరే ఆ పని చేసేతున్నారని సామ్ చెప్పుకొచ్చింది.

అది చూసి కంటతడి పెట్టుకున్నా

అది చూసి కంటతడి పెట్టుకున్నా

హైదరాబాద్ ఒక ముసలావిడ కనీసం నడవలేని స్థితిలో కూడా థియేటర్ కి వచ్చి ఓ బేబీ చూడటం చూశాను. అది చూసి కంటతడి పెట్టుకున్నా. నాకు తెలిసి అంతకన్నా బెటర్ కాంప్లిమెంట్ మరొకటి ఉండదు. ఓ బేబీ సినిమాను అన్ని వయసుల వారు ఆదరించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు, మీడియాకు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు అని సమంత అన్నారు.

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X