నేను అబ్బాయిని అయితే.. ఆ హీరోయిన్‌తో ప్రేమలో పడుతా.. సమంత

By Rajababu

Recommended Video

Rangasthalam Movie Sucess Enjoyed By Samantha

రంగస్థలం చిత్రంలో రామలక్ష్మీ పాత్రలో సమంత అక్కినేని అదరగొట్టింది. సమంత నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్ ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే భర్త నాగచైతన్యంతో అమెరికాలో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నది. రంగస్థలం ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది.

నా పెళ్లి రోజంటే

నా పెళ్లి రోజంటే

ఎనిమిదేళ్ల క్రితం ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సందర్భంగా నాగచైతన్య, సమంత ఇద్దరు అమెరికాలోని ఓ ప్రాంతంలో ప్రేమలోపడ్డారు. ఆ ప్రాంతంలోనే ఇప్పడు వారిద్దరూ సందడి చేస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను చైతూ, సమంత నెమరువేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ జీవితంలో ఎక్కువగా గుర్తు పెట్టుకొనే రోజు ఏమిటని ఓ అభిమాని అడుగగా నా పెళ్లి రోజు అని సమాధానం ఇచ్చింది.

దీపికా పదుకోన్ అంటే

దీపికా పదుకోన్ అంటే

మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్‌తో ప్రేమలో పడేవారు అని ఓ అభిమాని అడిగిన తుంటరి ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.. దీపికా పదుకోన్ అని సమాధానం చెప్పారు. తనకు దీపికా పదుకోన్ అంటే చాలా ఇష్టమని పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

సాయిపల్లవి అంటే ఇష్టం

సాయిపల్లవి అంటే ఇష్టం

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు బాగా నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి అని సమంత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ప్రేమమ్, ఫిదా, ఎంసీఏ, కణం చిత్రాలతో సాయి పల్లవి విలక్షణ నటిగా పేరుతెచ్చుకొన్నారు. ఆమె నటనను నాకు బాగా నచ్చింది అని అభిమాని ప్రశ్నకు జవాబిచ్చింది.

 నాకు రాంచరణ్ సరైన జోడి

నాకు రాంచరణ్ సరైన జోడి

రాంచరణ్‌తో తన కాంబినేషన్‌ను సరైన జోడిగా భావిస్తాను. రంగస్థలం సినిమా కథను సుకుమార్ చెప్పినపుడు అదృష్టంగా భావించాను. రాంచరణ్ చాలా సెన్సిబుల్. ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుంది అని సమంత చెప్పింది.

 ప్రతీ పాత్రలో నా స్వభావం

ప్రతీ పాత్రలో నా స్వభావం

నేను నటించే ప్రతీ పాత్రలో నా స్వభావం కనిపిస్తుంది. నిజ జీవితంలో ఎలా ఉంటానో నేను నటించే పాత్రల్లో అదీ కొంత వరకు కనిపిస్తుంది. నా అభిరుచికి తగిన పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉంటాను అని సమంత చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X