twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లికి ముందు ఉండేది.. చైతూ కత్తిరించేశాడు.. ఏఎన్నాఆర్ ప్రశంస మరిచిపోలేను.. సమంత

    |

    సమంత అక్కినేని తాజాగా యు టర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. ఇంటి బాధ్యతలను, కేరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకొంటున్న సమంత.. ఇటీవల ఆలీతో ఓ కార్యక్రమంలో ముచ్చటించారు. సమంత చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

     సమంత అంటేనే ఇష్టం

    సమంత అంటేనే ఇష్టం

    సమంత, సమంత రుత్ ప్రభు, సమంత అక్కినేని పేర్లలో నాకు సమంత అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా కష్టం వెనుక, సక్సెస్ వెనుక ఆ పేరుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే నేను ఎప్పుడు బాధ్యతతో ఉండాలని నిర్ణయించుకొన్నాను.

     అక్కినేని ఇంటి పేరు ఓ బాధ్యత

    అక్కినేని ఇంటి పేరు ఓ బాధ్యత

    అక్కినేని పేరు నా పేరుతో ముడిపడటాన్ని చాలా గౌరవంగా మాట్లాడుతాను. ఆ ఇంటి పేరు ఓ బాధ్యతగా భావిస్తాను. సమంత ఏం మాట్లాడినా ఇప్పుడు చాలా ప్రభావం ఉంటుంది. ఆ ఇంటి పేరు వల్ల నాకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది.

     నాగచైతన్యతో నేను

    నాగచైతన్యతో నేను

    ఇంట్లో తాను, నాగచైతన్య ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకొంటాం. ఎందుకంటే నాకు తెలుగు అంతగా రాదు. ఆయనకు ఏదో కొద్దిగా వస్తుంది. తెలుగు భాషను పూర్తిగా నేర్చుకోవడంపై దృష్టిపెట్టాను. యు టర్న్ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి.

    రంగస్థలం సినిమా గురించి

    రంగస్థలం సినిమా గురించి

    రంగస్థలం సినిమా చేసేటప్పుడు పూర్తిగా కథలో వినలేదు. కానీ కథ ఏంటో తెలుసు. అలాగే మహానటి విషయంలో కూడా నా పాత్ర, కథ గురించి పూర్తిగా అవగాహన ఉంది. యు టర్న్ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఈ సినిమా చేశాను.

    చైతూను మొదటిసారి చూసినప్పుడు

    చైతూను మొదటిసారి చూసినప్పుడు

    ఏం మాయ చేశావే సినిమా షూటింగ్ సందర్భంగా నాగచైతన్యను చూశాను. రెండో షెడ్యూల్‌లో మా మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నాకు చాలా సపోర్ట్‌గా నిలిచాడు. ఏడు నిమిషాల గేట్ సీన్‌లో నేను డైలాగ్ చెప్పాలి. నేను సరిగా డైలాగ్ చెబుతానో లేదో అనే భయంతో నా చేయిని నాగచైతన్య గట్టిగా నొక్కుతూనే ఉన్నాడు. ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని నవ్వుకొంటాం.

    నాకు షార్ట్ టెంపర్ ఉండేది

    నాకు షార్ట్ టెంపర్ ఉండేది

    పెళ్లికి ముందు షార్ట్ టెంపర్ ఉండేది. కానీ పెళ్లి తర్వాత చైతూ దానిని కత్తిరించేశాడు. ఇంట్లో చైతూదే అధిపత్యం. బయటకు కనిపించేలా అంత సౌమ్యుడిగా ఇంట్లో ఉండడు. నేను చైతూని ఇంట్లో బేబీ అని పిలుస్తాను. తను కూడా

    పవన్ కల్యాణ్ వల్లనే

    పవన్ కల్యాణ్ వల్లనే

    అత్తారింటికి దారేది చిత్రం షూటింగ్ సందర్బంగా అలీని పవన్ కల్యాణ్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆయనతో నటించిన మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయి. మనం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

    ఏఎన్నాఆర్ ప్రశంస మరిచిపోలేనిది

    ఏఎన్నాఆర్ ప్రశంస మరిచిపోలేనిది

    ఏం మాయ చేశావే సినిమా 50 డేస్ ఫంక్షన్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన కాంప్లిమెంట్ మర్చిపోలేనిది. అప్పుడు నాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి నటన ప్రదర్శించినందుకు నాగచైతన్యకు 49 మార్కులు, సమంతకు 51 మార్కులు ఇస్తానని అక్కినేని గారు చెప్పడం చాలా సంతోషం కలిగించింది.

    English summary
    Samantha Akkineni starrer U Turn is running successfully at the box office and today the makers organized the success meet in Hyderabad. In this occassion, Samantha shares a space with Ali for a show. She revealed some interesting things about her personal and professional life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X