ఓ బేబీ ఆడకపోతే కష్టమే.. ఏం చేయాలో తెలియని టెన్షన్.. సమంత

గతేడాది అభిమన్యుడు, రంగస్థలం, మహానటి, యూటర్న్ లాంటి సినిమాలతో సమంత అక్కినేని అదరగొట్టింది. 2019లో మజిలీ సూపర్ డీలక్స్‌తో శుభారంభం చేసింది. తాజాగా ఓ బేబీ అనే విభిన్నమైన చిత్రంతో వస్తున్నారు. పలు చిత్రాల్లో విలక్షణమైన నటన ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. స్టార్ హీరోయిన్‌గా మార్చడమే కాకుండా.. హీరో స్థాయికి తగినట్టు భారీ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ బేబీ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

ఓ బేబీలోని నా పాత్ర పూర్తిగా ఛాలెంజింగ్‌తో కూడుకొన్నది. చూడటానికి 70 ఏళ్లుగా కనిపిస్తుంది కానీ.. 24 ఏళ్ల వయసు అమ్మాయి ప్రవర్తనలా ఉంటుంది. ఇక నా ఫెర్మార్మెన్స్ బాగా ఉండటానికి కారణం డైలాగ్స్, గోదావరి యాస. భాష వల్లనే నా పాత్ర పూర్తిగా ఎలివేట్ అయిందని భావిస్తాను. మీరు కూడా చూస్తే కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అందుకు రైటర్ లక్ష్మీ భూపాల్‌ను అభినందించాలి. ఆయన రాసిన మాటలు, సాహిత్యం చాలా బాగుంది. ఈ సినిమాకు ఆయనే ఫిల్లర్ అని సమంత ప్రశంసల వర్షం కురిపించింది.

Samantha Akkineni interview: Talks about OH! Baby

ఇక ముందు రీమేక్ సినిమాలు చేయను. చాలా టెన్షన్‌గా ఉంటున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రాకపోవడం బాధగా ఉంది. యూటర్న్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు రాలేదు. దాంతో యూటర్న్‌లో ఏం మిస్ అయ్యామో.. అవన్నీ కరెక్ట్ చేసుకొని తీసిన సినిమా ఓ బేబీ. ఇది కూడా ఆడకపోతే నాకు ఏం చేయాలో తెలియదు అంటూ సమంత చమత్కరించింది. అంతేకాకుండా నా స్టార్ డమ్‌కు ఓ రకంగా ఓ పరీక్షనే అని ఆమె అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X