జీవితం చివరి వరకు మిమ్మల్ని ప్రేమిస్తాను.. సమంత.. కశ్మీర్లో చైతుతో కలిసి
నాగచైతన్యతో పెళ్లి తర్వాత వచ్చిన తొలి జన్మదిన్నాన్ని సమంత అక్కినేని ఘనంగా జరుపుకొన్నారు. సమంత బర్త్ డేను స్పెషల్‌గా జరుపుకోవడానికి చైతూ, సమంత ఇద్దరు జమ్ము, కశ్మీర్‌కు వెళ్లారు. శుక్రవారం రాత్రి బర్త్ డే సందర్బంగా కేక్ కట్ చేసిన ఫొటోలు, వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో సమంత షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మంచు కొండల బ్యాక్ డ్రాప్‌లో కేక్ ఫోటోను సమంత షేర్ చేసింది. నేను ఎక్కడున్నా సరే.. ఈ పిల్లలు నాకు కేక్ పంపేందుకు ఏదో ఒక మార్గం చూసుకుంటారు. నన్ను ప్రత్యేకం చేస్తారు. నా జీవితం చివరి వరకు మిమ్మల్ని ప్రేమిస్తాను' అంటూ తన స్నేహితుల గురించి సమంత రాశారు.


Click it and Unblock the Notifications











