టాలీవుడ్‌లో లైంగిక దాడులపై ఉక్కుపాదం... సమంత చేతికి కొత్త బాధ్యతలు

Recommended Video

Samantha Akkineni Takes Up New Position In Tollywood

మీ టూ ఉద్యమం జోరందుకొంటున్న నేపథ్యంలో మహిళా తారలపై దాడులను అరికట్టేందుకు సినీ పరిశ్రమలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్‌ అనే సంస్థను ప్రారంభించింది. ఇక టాలీవుడ్ కూడా ఓ విభాగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విభాగం టాలీవుడ్‌లో మహిళ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకొంటుంది.

 టాలీవుడ్‌లో కమిటీకి ఏర్పాట్లు

టాలీవుడ్‌లో కమిటీకి ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా పలువురు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు ప్రత్యేకంగా హాజరయ్యారు. మహిళలపై దాడులు జరుగకుండా చర్యలు తీసుకొనే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు.

 సమంత అక్కినేని చేతికి పగ్గాలు

సమంత అక్కినేని చేతికి పగ్గాలు

టాలీవుడ్‌లో మహిళల సంరక్షణ కోసం ఏర్పాటు చేసే విభాగానికి సమంత అక్కినేని అధ్యక్షురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కమిటీకి వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుపెట్టినట్టు సమాచారం.

హైదరాబాద్‌లో సమావేశం

హైదరాబాద్‌లో సమావేశం

హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహిళా తారలు, నిర్మాత, దర్శకులు సినిమా పరిశ్రమలో చోటచేసుకొంటున్న లైంగిక వేధింపులు, దాడులు, దుష్ప్రవర్తన లాంటి అంశాలను చర్చించినట్టు తెలిసింది. రామానాయుడు స్టూడియోలో శాశ్వత విభాగాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అమల అక్కినేని, ఝాన్సీకి చోటు

అమల అక్కినేని, ఝాన్సీకి చోటు

వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీలో పలువురు మహిళా సినీ ప్రముఖులు భాగస్వామ్యం పంచుకోబోతున్నారు. దీనిలో అమల అక్కినేని, ఝాన్సీ, సమంత కీలక బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇందులో మరికొందరికి అవకాశం కూడా కల్పించే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X