నాగచైతన్య, సమంత రొమాంటిక్ వీడియో.. ప్రతి రోజు ప్రేమలో పడుతాడు!
నాగచైతన్య, సమంత.. ఈ రియల్ లైఫ్ కపుల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండి తెరపై కూడా ఈ జంటకు తిరుగులేదు. పలు విజయవంతమైన చిత్రాల్లో కలసి నటించిన తరువాత నాగ చైతన్య, సమంత ప్రేమ వివాహంతో గత ఏడాది ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సినీ కెరీర్ ని కొనసాగిస్తూనే అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు.

కార్పొరేట్ సంస్థ
ఈ జంటకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కార్పొరేట్ సంస్థలు కూడా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. సమంత, నాగ చైతన్య ఓ యాడ్ లో కలసి నటించారు. ఈ యాడ్ వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నాగ చైతన్య, సమంత కలసి రొమాన్స్ పండించారు.
ప్రతి రోజు ప్రేమలో
ఓ సోపు యాడ్ కు సంబందించి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన చర్మ సౌందర్యంతో చైతు ప్రతి రోజు ప్రేమలో పడుతాడు అనే డైలాగ్ రొమాంటిగ్ గా ఆకట్టుకుంటోంది.

వివాహం తరువాత
ఇదిలా ఉండగా సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలసి నటించబోతున్న సంగతి తెలిసిందే. వివాహం తరువాత వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం ఇదే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది.

క్రికెటర్ కథ
ఆసక్తికరంగా ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. సమంత, చైతు ఈ చిత్రంలో భార్య, భర్తలుగానే కనిపిస్తారట.


Click it and Unblock the Notifications











