‘ఓ బేబీ’ ఎఫెక్ట్: సరికొత్తగా ట్రై చేయబోతున్న సమంత, చైతన్య
'ఓ బేబీ' సక్సెస్‌తో ఖుషీగా ఉంది అక్కినేని వారి కోడలు సమంత. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాల గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తనకు భారీ సక్సెస్ ఇచ్చిన నందినీ రెడ్డితో మరో సినిమా ప్లాన్ చేస్తుందని రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో బోలెడు అంశాలు తెరపైకి వస్తున్నాయి.

నందినీతో మరోసారి
నందినీ రెడ్డితో మరోసారి సమంత సినిమా చేయబోతుందని తెలుస్తోంది. ‘ఓ బేబీ' హిట్ అయితే తనతో మరో సినిమా చేస్తానని సామ్ విడుదలకు ముందే ఈ లేడీ డైరెక్టర్‌కు హామీ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సినిమా హిట్ అవడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు సమంత.. నందినీతోనే మరో సినిమా చేయబోతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో..
కొరియన్ సినిమాకు రీమేక్‌గా చేసిన ‘ఓ బేబీ' ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ సారి నందినీరెడ్డి సస్పెన్స్ థ్రిల్లర్‌ను చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేసిందని అంటున్నారు. ఈ కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం. అందుకే ఈ సినిమా చేయడానికి సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

భర్తతో కలిసి కొత్త బిజినెస్
నందినీరెడ్డితో చేసే సినిమా సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఉంటుందని, దీనికి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఈ సినిమా సమంతనే స్వయంగా నిర్మించబోతుందని సరికొత్త వార్త తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఆమె భర్త, ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా ఇందులో పాలు పంచుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంటే భార్యభర్తలిద్దరూ సినిమాను నిర్మించబోతున్నారన్న మాట.

‘ఓ బేబీ' గురించి..
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'. లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.

కలెక్షన్ల వర్షం
‘ఓ బేబీ' ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ఐదు రోజులు ముగిసే సమయానికి మొత్తంగా రూ. 19 కోట్ల గ్రాస్ సాధించింది. అలాగే, ఓవర్సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, సెకెండ్ వీక్ ప్రారంభం అయినా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మిగిలిన సినిమాలతో పోల్చితే ‘ఓ బేబీ' సీట్ ఆక్యూపెన్సీ విపరీతంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











