చెత్తగా ఆ హీరో రొమాన్స్... మూడ్‌లోకి దించడానికి చాలా కష్టపడ్డా.. సమంత

Recommended Video

'Doing A Romantic Song With Naga Shaurya Was The Worst' Says Samantha || Filmibeat Telugu

అందం, అభినయంతో మెప్పిస్తున్న సమంత అక్కినేని తాజా చిత్రం ఓ బేబీ. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందకు వస్తున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఈ వీడియోకు కేవలం 24 గంటల్లోనే 2 లక్షల వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో చేసిన రొమాంటిక్ పాటల గురించి వెల్లడిస్తూ...

 నాగశౌర్య చెత్తగా రొమాన్స్

నాగశౌర్య చెత్తగా రొమాన్స్

ఓ బేబీ పాటల్లో నాగశౌర్యతో కలిసి రొమాన్స్ చేయడం చాలా చెత్తగా, కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకు విపరీతమైన సిగ్గు. నాగశౌర్యను రొమాన్స్‌ మూడ్‌లోకి దించేందుకు ఆయనకు ఇష్టమైన కుక్కల గురించి మాట్లాడితే మూడ్‌లోకి వచ్చేవారు. నేను అంతగా కష్ట పడాల్సి వచ్చింది అని సమంత వెల్లడించింది.

 సమంత చెప్పింది నిజమే

సమంత చెప్పింది నిజమే

నాగశౌర్య గురించి సమంత చెప్పిన మాటలకు దర్శకురాలు నందినీ రెడ్డి వత్తాసు పలికింది. శౌర్య గురించి సమంత చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే. నాగశౌర్య తీరు చూసి నేను టెన్షన్‌గా ఫీలయ్యాను. ఆయనను చూసి ఓరి దేవుడో అని అనుకొన్నాను. అతనికి అంత సిగ్గుందని నాకు అసలే తెలియదు. హీరోయిన్‌ ఓ చోట ఉంటే.. దాదాపు 20 అడుగుల దూరంలో నాగశౌర్య ఉండేవాడు అని నందినీరెడ్డి చెప్పింది.

సమంత చాలా కష్టపడింది

సమంత చాలా కష్టపడింది

ఓ బేబీ సినిమా పాటల షూటింగ్ సందర్భంగా నాగశౌర్యను రొమాంటిక్ మూడ్‌లోకి తెప్పించడానికి సమంత చాలా కష్టపడింది. ఆయనకు కుక్కలంటే చాలా ఇష్టమని తెలిసి ఆమె వాటికి గురించి మాట్లాడి చొరవ తీసుకొన్నారు. దాంతో మెల్లగా రొమాంటిక్ మూడ్‌లోకి నాగశౌర్య వచ్చాడు. తమ ఇంట్లే ఉండే పెంపుడు కుక్క హాష్ అక్కినేని గురించి చెప్పి నాగశౌర్యను ఓ మూడ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది అని నందినీ రెడ్డి అన్నారు.

ఇద్దరికి ఇష్టమైన కుక్కల గురించే

ఇద్దరికి ఇష్టమైన కుక్కల గురించే

సమంత, నాగశౌర్యలో ఉండే కామన్ ఇంట్రెస్ట్ కుక్కులు. వాటి ద్వారా ఆ హీరోను ఫీల్ ఫ్రీగా మారేందుకు కుక్కల గురించి మాట్లాడింది. అలా రొమాంటిక్ మూడ్‌లోకి జారుకొన్న తర్వాత పాటలను షూట్ చేశాం. అయితే సమంత, నాగశౌర్య జంట తెరమీద అద్భుతంగా కనిపించారు. ప్రేక్షకులు ఈ జంటను చూసి ఫీల్‌గుడ్ అవుతారు అని నందినీ రెడ్డి అన్నారు.

70 ఏళ్ల బామ్మగా సమంత

70 ఏళ్ల బామ్మగా సమంత

ఓ బేబీ చిత్రం కొరియా చిత్రానికి రీమేక్. కొరియా భాషలో రూపొందిన మిస్ గ్రానీ అనే సినిమాను ఓ బేబీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించబోతున్నారు. 20 ఏళ్ల వయసు ఉణ్న అమ్మాయి పాత్రలో ప్రవేశించి తన కోరికలను తీర్చుకొనే వ్యక్తిగా సమంత నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X