88ఏళ్ల దర్శకుడితో సమంత న్యూ బయోపిక్.. ఇంకాస్త లేటయ్యేలా ఉంది!

అక్కినేని కోడలు సమంత ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఆమె పూర్తిగా పక్కన పెట్టేసిందనే చెప్పాలి. స్క్రిఫ్ట్ ఎంతో కొత్తగా ఉంటే కాని ఒకే చేయడం లేదు. గత కొంత కాలంగా ఆమె బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ తో బిజీ కానున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాను 88ఏళ్ల దర్శకుడు తెరకెక్కించనున్నట్లు కూడా టాక్ వచ్చింది.

సీనియర్ మోస్ట్ దర్శకుడు..

సీనియర్ మోస్ట్ దర్శకుడు..

ఆ దర్శకుడు మరెవరో కాదు. ప్రస్తుతం ఉన్న సినిమా ప్రపంచంలో అత్యంత సీనియర్. అలాగే సీనియర్ మోస్ట్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 90 ఏళ్ల వయసు దగ్గరపడుతున్నా కూడా ఇంకా ఆయన మంచి ఎనర్జీతోనే కనిపిస్తున్నారు. ఓ విధంగా నేటి జనరేషన్స్ కి ఆయన తన ఆరోగ్యంతో సవాల్ విసురుతూనే ఉన్నారు.

లాక్ డౌన్ లేకపోయి ఉంటే

లాక్ డౌన్ లేకపోయి ఉంటే

లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఒక సినిమాను కూడా మొదలు పెట్టె వారు. భైరవ ద్వీపం, ఆదిత్య 369 అనే సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు సమంతతో ఒక సినిమా చేయడానికి ప్లాన్ వేశారు. 90ల కాలంలో బెంగుళూరుకు చెందిన ఫెమినిస్ట్ నగరత్నమ్మ బయోపిక్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ పనులు ఆగిపోయాయి.

చివరికి సింగీతం చేతుల్లోకి..

చివరికి సింగీతం చేతుల్లోకి..


ఒక దేవదాసిగా జీవితాన్ని మొదలుపెట్టిన నాగ రత్నమ్మ కొంతకాలం తరువాత సంగీత కళాకారిణిగా మారింది. తన సంపదను కళలకు, కళాకారులకు ధార పోసింది. అయితే నగరత్నమ్మ బయోపిక్ పై గత కొన్నేళ్లుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఎంతో మంది దర్శకులు ఆమె జీవితంపై ఫోకస్ పెట్టారు గాని వర్కౌట్ కాలేదు. ఇక చివరికి సింగీతం శ్రీనివాసరావు ఆ బాధ్యతను తీసుకున్నారు.

Recommended Video

Celebrities Green India Challenge
ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉంది..

ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉంది..

మొదట నాగరత్నమ్మ బయోపిక్ కోసం అనుష్కను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ మళ్ళీ స్క్రిప్ట్ పై రెండవసారి కూర్చున్న సింగీతం సమంతకు కరెక్ట్ గా సెట్టవుతుందని ఆమెకు చెప్పడంతో వెంటనే ఒప్పేసుకుందట. కానీ సినిమా ఇంకా అఫీషియల్ గా మొదలుకాలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉందని టాక్ వస్తోంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం ఏ మాత్రం కరెక్ట్ కాదని సింగీతం ఆ ప్రాజెక్ట్ ను వాయిదా వేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X