సుదీర్ఘమైన అనుబంధం.. దూరమయ్యే సమస్యే లేదు.. ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత
పెళ్లి తర్వాత కూడా సమంత అక్కినేని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. 2018లో నాలుగు బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద హడావిడి చేసింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ చిత్రాలు ఆమె కెరీర్‌లోనే భారీ విజయాలుగా నమోదు చేసుకొన్నాయి. పెళ్లి అయితే హీరోయిన్లుగా పనికిరారనే అపోహను సమంత కొట్టిపారేసింది. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టగా నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అదేమిటంటే..

క్రిస్మస్ వేడుకలకు కోసం
ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల కోసం సమంత సిద్ధమవుతున్నది. తనకు ఇష్టమైన పండుగను జరుపుకోవడానికి రెడీ అవుతున్నాను. పండుగ కోసం ప్రత్యేకంగా అలంకరించుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా తన మేకప్ కోసం వాడే ఉత్పత్పులపై ఉన్న మమకారాన్ని వెల్లడించింది.
సుదీర్ఘమైన అనుబంధం
నేను వాడే నార్స్ వాకైరీ లిప్‌షేడ్ నాకు చాలా ప్రత్యేకం. ఆ మేకప్ ప్రొడక్ట్‌తో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. దానికి తిరుగు లేదు. మూడేళ్లుగా వాడుతున్నాను. భారతీయ చర్మానికి అది పక్కాగా సరిపోతుంది. దానిని మార్చే ఉద్దేశం లేదంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది. సమంత పోస్టుకు భారీగా లైకులు, కామెంట్లు వచ్చాయి.

సూపర్ డీలక్స్ చిత్రంలో
ప్రస్తుతం తమిళంలో సూపర్ డీలక్స్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి అరణ్య కాండ ఫేం త్యాగరాజన్ కుమారరాజా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు.

నాగచైతన్యతో మజిలీ
ఇక తెలుగులో మజిలీ అనే చిత్రంలో నాగచైతన్యతో కలిసి సమంత నటిస్తున్నది. ఈ చిత్రానికి నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత నాగచైతన్యతో కలిసి నటించడం ఇదే మొదటిసారి. మజిలీ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











