twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత

    |

    సమంత బాల్యం మొత్తం చెన్నైలోనే గడిచిందన్న సంగతి తెలిసిందే. సమంత స్కూల్ టాపర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఆ మధ్య తన మార్కులు, గ్రేడ్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇలా అన్నింటిని బయట పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇంత స్టార్డం వచ్చాక అలా ఓ సారి చిన్నతనం తిరిగిన వీధులు, స్కూల్ ఇలా అన్ని చోట్లకు వెళ్తుంటే కలిగే ఆ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం సమంత కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది.

    సమంత ప్రస్తుతం అక్కడే..

    సమంత ప్రస్తుతం అక్కడే..

    సమంత ప్రస్తుతం చెన్నైలో ఉందన్న విషయం విదితమే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రాబోతోన్న కాథవాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో సమంత నటిస్తోన్న విషయంతెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార, సమంత కలిసి నటిస్తోన్న ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ బాగానే క్లిక్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోనే జరుగుతోంది.

     చెన్నై వీధుల్లో..

    చెన్నై వీధుల్లో..

    అయితే ప్రస్తుతం సమంత చెన్నై వీధుల్లో తిరుగుతోంది. అలా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అంతే కాకుండా చిన్నప్పుడు తన బాల్కనీ నుంచి ఓ కొండను చూస్తూనే ఉండేదట. తన విషయాలన్నీ ఆ కొండకు మాత్రమే తెలుసట. ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

     స్పెషల్ వీడియో..

    స్పెషల్ వీడియో..

    సమంత తన చిన్న నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో పల్లవరం కొండను చూపించి దాని విశిష్టతను చెప్పుకొచ్చింది. ఈ కొండను నేను మా టెర్రస్ మీద నుంచి చూస్తూనే పెరిగాను.. నాకు ఇష్టమైన స్పాట్ అదే.. నా గురించి ఏ మనిషికీ తెలియనంతగా ఆ కొండకు మాత్రమే తెలుసేమో అంటూ అసలు గుట్టు విప్పింది.

     ఫస్ట్ లవ్.. హార్ట్ బ్రేక్..

    ఫస్ట్ లవ్.. హార్ట్ బ్రేక్..

    పరీక్షల రోజు ఉదయం నేను ఎలా ఉండేదాన్ని.. ఎంతో మంది దేవుళ్లకు ఎన్నో రకాలు మొక్కిన మొక్కులు, చేసిన ప్రామీస్‌లు. దానికే తెలుసు.. కానీ నేను వాటిని ఎప్పుడూ నెర వేర్చలేదనుకోండి.. నా ఫస్ట్ లవ్.. నా హార్ట్ బ్రేక్.. నా స్నేహితుల మరణం.. నా కన్నీళ్లు.. వీడ్కోలు.. ఇళా అన్నీ కూడా దానికే తెలుసు. అందుకే ఈ పోస్ట్ చేయడానికి ఆ కొండకు అన్నీ రకాల అర్హతలున్నాయంటూ సమంత ఎమోషనల్ అయింది.

    English summary
    Samantha Akkineni Now in Nostalgia feeling In chennai,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X