twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైడర్ మ్యాన్‌ను ఓడించిన సమంత.. షాక్ అవుతున్న సినీ పెద్దలు

    |

    Recommended Video

    Oh Baby Beats Spider-Man : Far From Home In Telugu States || Filmibeat Telugu

    వరుస విజయాలతో దూసుకుపోతోంది టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంత. ఇప్పటికే ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. తాజాగా 'ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. గత వారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే రావడంతో పాటు, ఈ సినిమా కలెక్షన్లలోనూ దుమ్ము దులుపుతుండడంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

    కలెక్షన్ల వర్షం

    కలెక్షన్ల వర్షం

    ‘ఓ బేబీ' ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. గత వీకెండ్‌ ముగిసే సమయానికి మొత్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఓవర్సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, సెకెండ్ వీక్ ప్రారంభం అయినా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మిగిలిన సినిమాలతో పోల్చితే ‘ఓ బేబీ' సీట్ ఆక్యూపెన్సీ విపరీతంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    స్పైడర్ మ్యాన్‌ను కొట్టేసిన ఓ బేబీ

    స్పైడర్ మ్యాన్‌ను కొట్టేసిన ఓ బేబీ

    సమంత నటించిన ‘ఓ బేబీ' ధాటికి హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం' సైతం చిన్నబోయింది. తెలుగులో డబ్బింగ్ అయిన ఈ సినిమా విజువల్ వండర్‌గా ప్రేక్షకుల నుంచి కితాబు అందుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ పరిచింది. లాస్ట్ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ‘ఓ బేబీ'కి 78 శాతం టికెట్లు అమ్ముడుబోగా, ‘స్పైడర్ మ్యాన్‌'కు మాత్రం 53 శాతం సీట్లు మాత్రం ఫుల్ అయ్యాయి. ఇక, మరో రెండు తెలుగు సినిమాలు ‘బ్రోచేవారెవరురా', ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' 58 శాతం, 57 శాతం ఆక్యూపెన్సీని సాధించడం విశేషం.

    ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం'

    ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం'

    ‘స్పైడర్ మ్యాన్' సిరీస్‌లో భాగంగా తాజాగా వచ్చిన చిత్రం ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోం'. టామ్ హోలాండ్, జెండయా, కోబి స్మల్డర్స్, శామ్యూల్ ఎల్. జాక్సన్, జేక్ గిల్లెనాల్, మరిసా టోమి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జాన్ వాట్స్ దర్శకత్వం వహించారు. కెవిన్ ఫీగే, అమీ పాస్కల్ నిర్మించారు. ఈ చిత్రం జూలై 5న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టినా.. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోవడం విశేషం.

    ‘ఓ బేబీ' గురించి..

    ‘ఓ బేబీ' గురించి..

    నందినీ రెడ్డి దర్శకత్వంలో స‌మంత అక్కినేని నటించిన చిత్రం ‘ఓ బేబీ'. ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్‌లు తెరకెక్కించారు. ‘మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్.

    English summary
    Samantha akkineni Recent Movie Oh Baby Runs successfully. This Movie Erned Rs 17 Cr gross In Just First 3 Days. And According To Trade Reports Oh Baby Beats Spider-Man: Far From Home In Telugu States.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X