ఆ మాట చెప్పగానే నాగచైతన్య తిట్టాడు.. అదే లేకుంటే గుడ్ బై చెప్పేసేదాన్ని.. సీక్రెట్స్ బటయపెట్టిన సమంత
టాలీవుడ్ హీరోయిన్స్ అందరిలో సమంత క్రేజే వేరు. స్టార్ హీరోయిన్‌గా ఆమె కొనసాగిస్తున్న సినీ ప్రయాణం అందరికీ ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆమెకున్న ఫాలోయింగ్ కొందరు స్టార్ హీరోలకు కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కొన్ని సీక్రెట్స్ కూడా బయటపెట్టింది. ఆ వివరాలేంటో చూద్దామా..

నాగచైతన్యతో పెళ్లయ్యాక.. గ్లామర్ వడ్డన
పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా అత్తారింట అడుగుపెట్టిన సమంత గత రెండేళ్లుగా వెండితెర జోష్ కొనసాగిస్తూ వస్తోంది. నాగచైతన్యతో పెళ్లయ్యాక ఆమెకు వరుస హిట్స్ ఖాతాలో పడటమే గాక పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియాలో సామ్ యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. గ్లామర్ వడ్డనతో పాటు తన విశేషాలు ఎప్పుడూ పంచుకుంటూనే ఉంటుంది.

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019.. ఈ రేంజ్‌లోనా?
హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019 జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్‌లో సినిమాలు చేస్తుందేంటి? అనే దానిపై క్లారిటీ ఇచ్చింది.

నీకేమైనా మైండ్ పోయిందా.. అన్నాడు
నిజానికి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నానని, ఇదే విషయాన్ని చైతూకు చెప్తే 'నీకేమైనా మైండ్ పోయిందా.. బుర్ర పని చేస్తుందా లేదా?' అంటూ తనను తిట్టాడని చెప్పింది సమంత. సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు.. వచ్చినా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధ్యం కాదు.. అలాంటప్పపుడు వచ్చిన ఛాన్సులు ఎందుకు వదిలేసుకుంటావని చైతూ అన్నాడని తెలిపింది.

చైతూ ప్రోత్సాహమే లేకుంటే ఈ పాటికి..
తనను నాగచైతన్య ఎంతాగానో ఎంకరేజ్ చేసాడని, చైతూ ప్రోత్సాహమే లేకుంటే ఈ పాటికి సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయేదాన్ని అని సమంత పేర్కొంది. దీంతో చైతూకు ఇష్టం లేకుండా సమంత వరస సినిమాలు చేస్తుందని వస్తున్న విమర్శలకు చెక్ పడినట్లయింది.
Recommended Video

సీక్రెట్ ప్లేస్‌లో భర్త పేరుతో..
ఇకపోతే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటో షేర్ చేస్తూ ఇప్పటి వరకు ఎవరి కంటాపడని ఓ టాటూను చూపించింది సమంత. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చింది సమంత. ''ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం'' అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











