For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ బర్త్ డే కామన్ డీపీ.. మామకు ప్రేమతో సమంత!!

    |

    సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోల స్టామినాను సోషల్ మీడియా రికార్డుల్లోనూ కొలుస్తున్నారు. ఏ హీరో ఫ్యాన్స్ ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు.. ట్వీట్లతో అలుపెరగని యుద్దాలు చేస్తున్నారో వారి హవానే నడుస్తున్నట్టు లెక్క. అందుకు హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ చేస్తున్నారు. ఒక్కోసారి ఈ యుద్దం కోలవుడ్, టాలీవుడ్ మధ్య కూడా నడుస్తుంది.

    ఇక ఈ మధ్యలో అంతటి రచ్చ చేసిన సోషల్ మీడియా వార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరిగింది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ట్వీట్ల పోరు కొనసాగించారు. మహేష్ ఫ్యాన్స్ క్రియేట్ 61 మిలియన్ల ట్వీట్ల రికార్డును పవన్ ఫ్యాన్స్ బద్దలు కొట్టారు. 24 గంటలో 65 మిలియన్ల ట్వీట్లతో పవన్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక నిన్న మెగా ఫ్యాన్స్ కామన్ డీపీ, బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌లతో సందడి చేశారు. ఇప్పుడు మాత్రం నాగార్జున అభిమానుల వంతు వచ్చింది.

    Samantha Akkineni Released Nagarjuna Akkineni Birthday CDP

    సోషల్ మీడియా నాగ్ బర్త్ డే హల్చల్ సమంతతో మొదలైంది. నాగ్ బర్త్ డే కామన్ డీపీని సమంత రిలీజ్ చేసింది. ఆగస్ట్ 23న సాయంత్రం ఆరు గంటలకు కామన్ డీపీని విడుదల చేసిన సమంత.. ది కింగ్.. నాగార్జున బర్త్ డే కామన్ డీపీని రిలీజ్ చేయడం ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఆయన పట్ల నిరంతరం ప్రేమ, గౌరవం ఉంటాయి.. మనస్తత్వంలోనూ ఆయన ఓ కింగ్ అంటూ చెప్పుకొచ్చింది.

    English summary
    Samantha Unveils Nagarjuna Birthday CDP. The King honoured to release the CDP to celebrate iamnagarjuna‘s birthday Partying faceHugging faceSmiling face with 3 hearts .. to know him is to love and respect him forever . A king at heart Folded hands #KingNagBirthdayCDP
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X