మామ నాగార్జునను మించిన కోడలు పిల్ల.. సమంతకు బిగ్‌బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చరిత్రలో దసరా పండుగ సంబరాలు భారీగా జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు గంటలపాటు నిర్విరామంగా కార్యక్రమాలు జరిగాయి. దసరా పండుగ నేపథ్యంలో జరిగిన మహా ఎపిసోడ్‌కు సమంత అక్కినేని హోస్ట్‌గా ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే మూడు గంటల షో కోసం నిర్వాహకులు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించినట్టు సమాచారం. సమంతకు ఎంత చెల్లించారంటే..

 నాగ్ స్థానంలో సమంత హోస్ట్‌గా

నాగ్ స్థానంలో సమంత హోస్ట్‌గా

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3తోపాటు ప్రస్తుత సీజన్‌కు ముందుకు తీసుకెళ్తున్న అక్కినేని నాగార్జున గతేడాది మాదిరిగానే కొన్ని రోజులు షోకు దూరమయ్యారు. గత సంవత్సరం తన పుట్టిన రోజున ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెల్లడంతో రమ్యకృష్ణ హెస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం కులు మనాలికి వెళ్లిన నాగ్.. ఈ షోకు మరోసారి దూరమయ్యారు. అయితే ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై చాలా కాలం చర్చ జరిగింది.

 హెస్ట్‌ కోసం పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు

హెస్ట్‌ కోసం పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు

అయితే పలువురుని హోస్ట్‌గా వ్యవహరించమని అడిగితే అందుకు భారీగా రెమ్యునరేషన్ అడిగారని, మరికొందరు నిరాకరించారని తాజా సమాచారం. అయితే నాగార్జున స్థానంలో సరైన అభ్యర్థి కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో నాగార్జునతో సంప్రదింపులు జరిపారట. ఆ క్రమంలోనే సమంత పేరు తెరపైకి వచ్చిందనే తాజా సమాచారం. సమంత అయితే రెమ్యునరేషన్ కూడా కలిసి వస్తుంది అని సూచించడంతో నిర్వాహకులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు.

సమంత హెస్ట్‌గా వ్యవహరించేందుకు

సమంత హెస్ట్‌గా వ్యవహరించేందుకు

ఇక సమంత అక్కినేనిని సంప్రదించగా ఆమె తొలుత కొంత సమయం కావాలని అడిగారని, నాగార్జున స్థానంలో హోస్ట్‌గా వ్యవహరించడం అంటే కత్తి మీద సామే అనే సమాధానం ఆమె నుంచి వ్యక్తమైందట. అయితే సమంత ఒప్పుకోకపోతే నేనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను. ఓ సారి ప్రయత్నిద్దాం అంటూ నిర్వాహకులకు చెప్పి.. సమంతను ఒప్పించడంలో నాగ్ సఫలమయ్యాడు.

 మూడు గంటల ఎపిసోడ్ కోసం..

మూడు గంటల ఎపిసోడ్ కోసం..

మూడు గంటల ఎపిసోడ్‌కు చాలా సమయమే సమంత వెచ్చించాల్సి వచ్చింది. షోను మరింత క్రేజ్‌గా మలచడానికి ఆమె చాలా చోరవ తీసుకొన్నారు. నాగ్‌లేని కొరతను సమంత తీర్చింది అని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే దసరా బిగ్‌బాస్ ఎపిసోడ్‌పై భారీగా టీఆర్పీని అంచనా వేస్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
 సమంత అందుకొన్న రెమ్యునరేషన్ ఎంతంటే

సమంత అందుకొన్న రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్‌బాస్ దసరా ఎపిసోడ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సమంత అక్కినేని నిర్వాహకుల నుంచి భారీగా రెమ్యునరేషన్ అందుకొన్నారు. సినీ, టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించినట్టు తెలుస్తున్నది. అయితే బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం.. రెమ్యునరేషన్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలనే నిబంధనను సెలబ్రిటీలకు విధిస్తారనే విషయం తెలిసిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X