»   » నీచంగా ఏమీ లేదు: బికినీ ఫోటోపై ఘాటుగా రియాక్టైన అక్కినేని సమంత!

నీచంగా ఏమీ లేదు: బికినీ ఫోటోపై ఘాటుగా రియాక్టైన అక్కినేని సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో హాట్ హాట్ బికినీ ఫోటో పోస్టు చేయడం వివాదానికి దారి తీసింది. మాల్దీవులకు వెకేషన్ వెళ్లిన సందర్భంగా దిగిన ఈ ఫోటోను ఆమె పోస్టు చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయింది. పెళ్లయిన తర్వాత బికినీలో ఈ గ్లామర్ వేషాలేంటో... అంటూ కొందరు అభిమానులు, నెటిజన్లు విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై సమంత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

అదేమీ అసభ్యకరం, నీచంగా లేదే...

అదేమీ అసభ్యకరం, నీచంగా లేదే...

నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. అయినా అదేమీ అసభ్యకరంగా, నీచంగా లేదు... అంటూ తనదైన రీతిలో సమంత రియాక్ట్ అయ్యారు. ఆమె స్పందించి తీరు చూస్తుంటే తన బికినీ ఫోటోపై ట్రోలింగ్ చేయడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నా రూల్స్ నేను రాసుకుంటా... మీ రూల్స్ మీరు రాసుకోండి

నా రూల్స్ నేను రాసుకుంటా... మీ రూల్స్ మీరు రాసుకోండి

‘నా రూల్స్ నేను రాసుకుంటాను... మీ రూల్స్ మీరు రాసుకోండి' అని ఆమె కామెంట్ చేయడం ద్వారా..... మీ పని మీరు చూసుకోండి నా వ్యవహారంలో తలదూర్చవద్దని చెప్పుకనే చెప్పింది ఈ చెన్నై బ్యూటీ.

స్ట్రాంగ్ మెసేజ్

‘ఎ స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ డిటెర్మైన్డ్ టు డూ సంథింగ్ అదర్స్ ఆర్ డిటెర్మైన్డ్ నాట్ బి డన్' అంటూ సమంత ఓ స్ట్రాంగ్ మెసేజ్ పోస్టు చేసింది. నాగ చైతన్యను పెళ్లాడటం ద్వారా సమంత అక్కినేని వారి ఇంటి కోడలైన సంగతి తెలిసిందే.

పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో...

పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో...

సాధారణంగా చాలా మంది హీరోయిన్లు సినిమా ఆఫర్లు ఉన్నంత వరకు పెళ్లికి దూరంగా ఉంటారు. ఆఫర్లు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతారు. అయితే సమంత ఓ వైపు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తన కోస్టార్ నాగ చైతన్యను పెళ్లాడారు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు.

వరుస సినిమాలతో సమంత బిజీ బిజీ

వరుస సినిమాలతో సమంత బిజీ బిజీ

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. తెలుగులో రామ్ చరణ్ ‘రంగస్థలం', ‘మహానటి' చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో ఇరుంబు తీరల్, సూపర్ డీలక్స్ చిత్రాలు చేస్తోంది. దీంతో పాటు ‘యూ టర్న్' అనే ద్విబాషా(తమిళం-తెలుగు) చిత్రంలో కూడా నటిస్తోంది.

English summary
South actress Samantha Akkineni posted a picture of herself in a bikini on Instagram so as to explain her dire need for a vacation. But little did she know that social media doesn't really possess an appetite for pictures as such since folks trolled Samantha for Instagramming her photograph in what they considered to be "indecent attire." Samantha, however, is no less for she responded with a strongly-worded post.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu