Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాబోయ్! జూనియర్ ఎన్టీఆర్‌తో చాలా కష్టం.. కిక్కిచ్చే కామెంట్స్ చేసిన సమంత
టాలీవుడ్లో ప్రెసెంట్ మంచి జోష్‌లో హీరోయిన్ ఎవరంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు సమంత. అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్గా సమంత వెండితెర ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన ఆడిపాడిన సమంత.. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది. ఆయనపై సమంత చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ సమంత ఏమని కామెంట్ చేసింది? అది ఎక్కడ చేసింది? వివరాల్లోకి పోతే..
మంచు లక్ష్మితో పడక గది రహస్యాలను బయటపెట్టే షో..
'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే పేరిట సెలెబ్రిటీల పడక గది రహస్యాలను బయటపెట్టే ఓ షో రన్ అవుతోంది. ఆన్ లైన్ వేదిక అయిన వూట్ యాప్‌లో ప్రసారమయ్యే ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సెలబ్రిటీల అంతరంగిక విషయాలను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం దిశగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. తాజాగా ఇదే కార్యక్రమంలో సమంత చేత సీక్రెట్స్ బటయపెట్టించింది మంచు లక్ష్మి.
బాబోయ్! ఎన్టీఆర్‌తో చాలా కష్టం
ఈ సందర్బంగా మీతో నటించిన స్టార్ హీరోస్లో బెస్ట్ డాన్సర్ ఎవరు అనే ప్రశ్న వేసింది మంచు లక్ష్మి. దీనిపై స్పందించిన సమంత ఏ మాత్రం తడుముకోకుండా జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం చెప్పేసింది. బాబోయ్! ఆయనతో డాన్స్ చేయాలంటే చాలా కష్టం. అందరు హీరోల్లో ఎన్టీఆర్ ది బెస్ట్ డాన్సర్ అని కితాబిచ్చింది సమంత.
బన్నీ, చెర్రీ, ఎన్టీఆర్‌లతో సమంత చిందులు
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్లుగా చెప్పుకోవాలంటే.. ముందు వరుసలో ఉంటారు బన్నీ, చెర్రీ, ఎన్టీఆర్. అయితే ఈ ముగ్గురితోనూ చిందులేసింది సమంత. చెర్రీతో రంగస్థలంలో, బన్నీతో సన్నాఫ్ సత్యమూర్తిలో అలాగే ఎన్టీఆర్‌తో బృందావనం, రభస, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్ అనే నాలుగు సినిమాల్లో నటించింది సామ్.
నందమూరి అభిమానుల్లో జోష్ నింపేలా
తన దృష్టిలో ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని చెప్పిన సామ్.. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ని నేను గమనించేదాన్నని, ఆయన సింగిల్ టేక్‌లోనే ఎన్టీఆర్ డాన్స్ మూమెంట్స్ ఓకే అయిపోతాయని చెప్పింది. అలా తనకు మాత్రం అస్సలు సాధ్యం కాదని సమంత పేర్కొంది. దీంతో సామ్ చేసిన ఈ కామెంట్స్ చూసి మురిసిపోతున్నారు నందమూరి అభిమానులు.
కొమురం భీం ఎన్టీఆర్
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. భారీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. చిత్రంలో కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్నారు ఎన్టీఆర్. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
సమంత స్పీడ్ చూస్తే..
పెళ్లి తర్వాత మరింత స్పీడ్ పెంచేసింది సమంత. ఇటీవలే ఓ బేబీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత మరికొద్ది రోజుల్లోనే 96 రీమేక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక మరోవైపు సమంత వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిందనేది తాజా సమాచారం.