'జబర్దస్త్'కి షాక్.. నిలిపివేయాలంటూ హైకోర్టు నోటీసులు
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంతకు తన గత సినిమాకు సంబందించి ఊహించని షాక్ తగిలింది. ఆమె గత సినిమా 'జబర్దస్త్' కి సంబందించిన డీవీడీలు, వీసీడీలు, బ్లూరే డిస్క్స్ ఫార్మాట్లలో విడుదల చేయడం, టీవీల్లో ప్రసారం చేయడం లాంటివి చేయకూడదని పేర్కొంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జబర్దస్త్. ఈ సినిమాలో సమంత, సిద్దార్థ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరించగా తమన్ సంగీతం అందించారు. 2013 సంవత్సరంలో ఈ సినిమాను బాలీవుడ్ నుంచి రీమేక్ చేశారు. అంతకంటే ముందే అనగా 2010 సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రణ్‌వీర్ సింగ్, అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'బ్యాండ్ బాజా బారాత్' సినిమాను తెలుగులో జబర్దస్త్ పేరుతో రీమేక్ చేశారు. దీంతో తమ సినిమా కంటెంట్ కాపీ కాబడిందని అప్పట్లో యాష్ రాజ్ ఫిలిమ్స్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును విచారించిన హై కోర్టు తాజాగా 'జబర్దస్త్' సినిమా నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక సమంత ప్రెసెంట్ సినిమాల విషయానికొస్తే.. పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన సమంత ఈ ఏడాది వరుస సక్సెస్ లతో దూసుకు పోతోంది. భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ రూపంలో, లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఓ బేబీ రూపంలో వరుసగా రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత. సినిమాలు ఆపేదే లేదని, మున్ముందు మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, విలక్షణ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకొస్తానని సమంత పేర్కొంటోంది.


Click it and Unblock the Notifications











