అక్కినేని ‘త్రయం’తో హాట్ బేబీ సమంత

ఇటీవలే విక్రమ్ కుమార్ నాగార్జునను కలిసి కథ వివరించాడు, నాగార్జునకు స్టోరీ నచ్చిందని...పూర్తి స్కిప్టు తయారు చేసే పనిలో పడ్డాడు దర్శకుడు. 2012 ఎండింగ్ కల్లా ఈచిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.
సమంత ప్రస్తుతం బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఈగ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని జులైలో విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు ఆమె గౌతం మీనన్ దర్శకత్వంలో ఒకే సినిమాను మూడు బాషల్లో ముగ్గురు హీరోలతో చేస్తోంది. తెలుగులో 'ఎటో వెళ్లి పోయింది మనసు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని హీరో. మరో వైపు రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంతో పాటు, మహేష్ బాబు సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలోనూ నటిస్తోంది. ఇవేకాక నాగచైత్యతో ఆటో నగర్ సూర్య చిత్రంతో పాటు తమిళంలో రెండు ప్రాజెక్టులకు కమిట్ అయింది.
ప్రస్తుతం నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. జులైనెలలో ఈచిత్రం విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ దాదాపుగా రూ. 40 కోట్లతో దీన్ని నిర్మించారు ఆర్ ఆర్ మూవీమేకర్స్ వారు. నాగార్జునకు ఉన్న మార్కెట్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో చిత్రాన్ని లాభాల్లో అమ్ముకోవడానికి నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాతలు చెప్పిన రేటుకి కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











