వరల్డ్ కప్‌తో సమంత పోటి.. ట్రెండ్‌కు విరుద్ధంగా సురేష్ బాబు సాహసం..
గత రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత అక్కినేని మరో క్రేజీ ప్రాజెక్ట్ ముందుకొస్తున్నారు. 2018లో అభిమన్యుడు, రంగస్థలం, యూటర్న్ చిత్రాలతో ఆకట్టుకొన్నారు. తాజాగా తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొన్నారు. ఇప్పుడు ఓ బేబీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీ సురేష్ బాబు నిర్మాత. నందినీ రెడ్డి దర్శకురాలు. ఈ సినిమాను రానున్న ప్రపంచ క్రికెట్ కప్ సీరిస్ జరిగే సమయంలో రిలీజ్ చేయాలనుకొంటున్నట్టు నిర్మాత సురేష్ బాబు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సమంత గ్రేట్ యాక్ట్రెస్. ఓ బేబి సినిమాతో మరోసారి అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు అని అన్నారు. ఓ బేబి సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. వరల్డ్ క్రికెట్ కప్ జరిగే సమయంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కంటెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం అనే అభిప్రాయాన్ని సురేష్ బాబు వ్యక్తం చేశారు.

అయితే ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకొంటున్నారు. అయితే ట్రెండ్‌కు వ్యతిరేకంగా సురేష్ బాబు తన సినిమా ఓ బేబిని రిలీజ్ చేయడంపై ట్రేడ్, సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











