బాలీవుడ్‌లోకి ఓ బేబీ... రానా దగ్గుబాటి క్లారిటీ... ఏమన్నారంటే..
Recommended Video
డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత, నాగశౌర్య జంటగా నటించిన ఓ బేబీ సినిమా విజయవంతగా ప్రదర్శింపబడుతున్నది. సమంత నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు గుప్పమన్నాయి. ఈ వార్తలపై రానా దగ్గుబాటి వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

తొలివారాంతానికి భారీగా వసూళ్లు
ఓ బేబీ చిత్రం జూలై 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రం తొలి వారాంతానికి రూ.17 కోట్లు వసూలు చేసింది. హీరోయిన్ ప్రధానంగా రూపొందిన ఓ చిత్రం ఈ రేంజ్‌లో వసూలు చేయడం ఇదే మొదటిసారి. తన చిత్రానికి క్రిటిక్స్ నుంచి వచ్చిన స్పందన చూసి సమంత, చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

బాలీవుడ్‌లోకి రీమేక్
ఓ బేబీ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా రానా మాట్లాడుతూ.. హిందీలో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ అలాంటి ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. వాస్తవానికి ఈ చిత్రం కొరియా భాషలో మిస్ గ్రానీగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మించాం. హిందీలో కూడా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని రానా దగ్గుబాటి అన్నారు.

ఇప్పటికే పలు భాషల్లోకి మిస్ గ్రానీ
కొరియాలో విజయవంతమైన మిస్ గ్రానీ చిత్రం ఇప్పటి వరకు ఏడు భాషల్లో రూపొందింది. తెలుగులో కూడా తాజాగా విడుదలై భారీ విజయాన్ని దక్కించుకొన్నది. బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి సందడి చేస్తున్నది. మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందనే విషయం కొద్ది రోజుల్లో తెలుస్తుంది అని రానా వెల్లడించినట్టు సమాచారం.

నటీనటులకు విశేష గుర్తింపు
ఇక ఓ బేబీ చిత్రంలో సీనియర్ నటీనటులు రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. తేజా సజ్జా, రావు రమేష్, ఐశ్వర్య, నాగచైతన్య (గెస్ట్) పాత్రల్లో కనిపించారు. సమంత నటనతోపాటు లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ పాత్రలు అనూహ్యమైన స్పందనను రాబట్టాయి. అలాగే మాటలు, పాటల రచయిత లక్ష్మీ భూపాల ప్రతిభకు సరైన గుర్తింపును ఓ బేబీ తెచ్చిపెట్టిందనే మాట బలంగా వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











