ఓ బేబీ ప్రీ రివ్యూ: సమంత డిఫరెంట్‌గా... సినిమా ఎలా ఉందంటే!
యూటర్న్ తర్వాత మరో రీమేక్‌తో సమంత అక్కినేని డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యారు. కొరియా భాషలో విశేష ప్రేక్షకాదరణ పొందిన మిస్ గ్రానీ అనే సినిమా రీమేక్ చేసి ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం నందిని రెడ్డి. నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ప్రధాన తారాగణం. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఓ బేబీ గురించి సమంత చెప్పిన ప్రధాన అంశాలు..

ఓ బేబీ ప్రత్యేకమైన సినిమా
ఓ బేబీ సినిమా కామెడీ, ఎమోషన్, మెసేజ్ లాంటి అంశాలు ఉన్న ఓ ప్రత్యేకమైన జోనర్ సినిమా. ఓ బేబీ సినిమా కొరియా సినిమా మిస్ గ్రానీకి రీమేక్. తొలిసారి కొరియా సినిమాకు సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులతో చాలా రోజులు చర్చలు జరిపాం. తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు చేశాం. మూలకథను ఏ మాత్రం మార్చకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకొన్నాం. కొరియా సినిమా నిర్మాతలను ఈ సినిమాలో కూడా భాగస్వామ్యం చేశాం. వారిని కూడా ఈ సినిమాలో నిర్మాతల్లో ఒకరుగా ఉంటారు అని సమంత అన్నారు.

70 ఏళ్ల, 24 ఏళ్ల పాత్రల్లో
ఇప్పటి వరకు నేను చాలా సినిమాల్లో ఎమోషనల్ పాత్రలు చాలా చేశాను. రొమాంటిక్, డ్రామా లాంటి సినిమాల్లో నటించాను. కానీ కామెడీ సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఎమోషనల్ పాత్రలు చేయడం నాకు కష్టం కాదు. కానీ కామెడీ చేయడం ఎంత కష్టమో ఓ బేబీలో అర్ధమైంది. కామెడీ రిథం తెలియదు. ఆ రిథమ్ పట్టుకోవడానికి కష్టమైంది. గతంలో అఆ సినిమాలో చేసినప్పటికీ.. ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమా. ఇది 70 ఏళ్లు, 24 ఏళ్ల దేహంలో నా పాత్ర ఉండాలి. వయసుకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మిస్ కాకుండా కామెడీని పంచాలి.

వృద్ధురాలి రోల్ కోసం
వృద్ద పాత్ర కోసం కొంత కసరత్తు చేశాను. సినిమాకు ముందు వృద్ధుల ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ చాలా మంది వృద్దులతో మాట్లాడాను. వారి బాడీ లాంగ్వేజ్ చూశాను. వృద్ధులంటే చిన్నపిల్లలతో సమానం. వారిలో చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ప్రతీ పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. బేసిక్‌గా నేను యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లలేదు. తోటి నటీనటులను చూసి నేర్చుకొన్నాను. ఓ బేబీలో కామెడీ పరంగా నటన రాజేంద్ర ప్రసాద్‌తో సాధ్యమైంది. సీనియర్ నటుడిగా ఆయన చాలా హెల్ప్ అయ్యారు. సీనియర్ నటి లక్ష్మీ గారిని చూసి కొంత నేర్చుకొన్నాను అని సమంత చెప్పారు.

మూడు రకాల షేడ్స్‌తో సమంత
సమంత అక్కినేని మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్‌కు గర్ల్‌ఫ్రెండ్‌గా, రావు రమేష్‌కు తల్లిగా, లక్ష్మీ సజ్జాకు అమ్మమ్మగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా కామెడీతో కూడిన భావోద్వేగమైన సినిమా. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

వరుస హిట్లతో ఒత్తిడి
వరుస హిట్లు రావడంతో నాకు నేను బెటర్‌గా చేయాలని ప్రిపేర్ అవుతాను. నాపై నేనే ప్రెజర్ పెంచుకొంటాను. గత సినిమా కంటే ఈ సినిమా బాగా చేయాలి. అంతకంటే బాగా చేయాలని ప్రతీ సినిమాకు నేను డిసైడ్ అవుతాను. నాపై ఎలాంటి ఒత్తిడి పెరుగదు. కానీ నా అంతట నేను ఒత్తిడి పెంచుకొంటాను. ఓ బేబీపై కూడా అలాంటి ఒత్తిడి పెంచుకొన్నాను అని సమంత పెట్టారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
సమంత అక్కినేని, లక్ష్మీ, నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్, తేజ సజ్జా, ప్రగతి, ఐశ్వర్య, ఉర్వశి, ప్రియదర్శి, ధనరాజ్, అడివి శేషు
స్క్రీన్ ప్లే, డైరెక్టర్: బీవీ నందినీరెడ్డి
నిర్మాతలు: డీ సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్, థామస్ కిమ్
మాటలు: లక్ష్మీ భూపాల
సంగీతం: మికీ జే మేయర్
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
రిలీజ్: 2019-07-05


Click it and Unblock the Notifications











