ఓ బేబీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆడియెన్స్ రియాక్షన్ ఇలా
Recommended Video
'మిస్ గ్రానీ' అనే కొరియన్ మూవీకి తెలుగు రీమేక్‌గా 'ఓ బేబీ' సినిమా ఈ రోజు (జులై 5 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చిత్రంలో సమంత, నాగశౌర్య లీడ్ రోల్స్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోస్ కంప్లీట్ చేసుకుంది. ట్విట్టర్ వేదికగా కొందరు ప్రేక్షకులు ఓ బేబీ పై స్పందించిన తీరు చూస్తే..
ఫన్, ఎమోషనల్ అన్నీ ఉన్నాయ్
ఓ బేబీ మూవీ మంచి ఎంటర్‌టైనర్ సినిమా. ఇందులో కామెడీ, ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం ఖాయం. మనసు పెట్టి ఈ సినిమా రూపొందించారు. కంగ్రాట్స్ సమంత.
ప్రతీ సీన్ మనసును హత్తుకుంది.. నవ్వాను, ఏడ్చాను
ఓ బేబీ సినిమా చూశాను. ఎమోషనల్ జర్నీ.. సినిమా సూపర్ గా ఉంది. ఓ బేబీ లోని ప్రతీ సీన్ మనసును హత్తుకుంది. సినిమా చూస్తూ నవ్వాను, ఏడ్చాను. అన్ని రకాల ఫీలింగ్స్ పంచుతూ సూపర్ గా ఎంటర్‌టైన్ చేసింది ఓ బేబీ. సూపర్ డూపర్ హిట్ ఖాయం. ఓ బేబీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది.
నాన్ రొటీన్ చిత్రం ఓ బేబీ
తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన నాన్ రొటీన్ చిత్రమిది.. చిత్రంలోని నటీనటులంతా చాలా బాగా నటించారు. థియేటర్‌కి వెళ్లి తప్పకుండా ఇలాంటి చిత్రాన్ని చూడమని మా అమ్మకి చెప్పా. ఓ బేబీ సినిమా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది.
క్లైమాక్స్ చాలా బాగుంది.. నా రేటింగ్
ఓ బేబీ సినిమా చాలా బాగుంది. మునుపెన్నడూ చూడని కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో చూడొచ్చు. క్లైమాక్స్ అదిరింది. సమంత అచ్తింగ్ సూపర్. నా రేటింగ్ 4 /5.
ఫ్యామిలీతో కలిసి తప్పక చూడాల్సిన సినిమా
ఇప్పుడే ఓ బేబీ సినిమా చూశాను. మనసుకు హత్తుకునే సినిమా ఇది. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. సమంత పర్ఫార్మెన్స్ అద్భుతం. యాక్టర్ తేజకు ఇది మంచి సక్సెస్ ఇచ్చే డెబ్యూ ఫిలిం అవుతుంది. కంగ్రాట్స్ టు ఓ బేబీ టీమ్.
అందరూ అదరగొట్టారు.. వావ్ బేబీ
రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, సమంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. సీనియర్ నటి లక్ష్మి నటన ఆకట్టుకుంది. కామెడీతో కూడిన ఎమోషనల్ జర్నీ ఓ బేబీ సినిమా. డైరెక్టర్ నందినీ రెడ్డి మరోసారి సత్తాచాటింది.
సమంత కాన్ఫిడెన్స్.. హార్ట్ టచింగ్ మూవీ
ఓ బేబీ సినిమాలో సమంత చాలా కాన్ఫిడెంట్ గా నటించింది. రియల్లీ హార్ట్ టచింగ్ మూవీ. ఎమోషనల్ కుటుంబ కథా చిత్రం. రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, లక్ష్మి అందరూ సూపర్ పర్ఫార్మెన్ ఇచ్చారు. ఓ బేబీ సూపర్ హిట్ ఖాయం.


Click it and Unblock the Notifications











