చీటింగ్ చేయను.. నేను స్నానం అలానే చేస్తా.. సమంత వైరల్ ట్వీట్

Recommended Video

Actress Samantha Takes Up The One Bucket Challenge || Filmibeat Telugu

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చైన్ సిస్టంలా కొన్ని ఛాలెంజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఒకరు విసిరిన ఛాలెంజ్ ని మరొకరి స్వీకరిస్తూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న ఛాలెంజ్ 'వన్ బకెట్ ఛాలెంజ్'. తాజాగా ఈ ఛాలెంజ్ స్వీకరించిన సమంత ఆసక్తికరంగా స్పందిస్తూ ట్వీట్ చేసింది.

వన్ బకెట్ ఛాలెంజ్

వన్ బకెట్ ఛాలెంజ్

దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నీటి పొదుపును తెలియజేసేందుకు గాను ‘ఒన్ బకెట్' ఛాలెంజ్‌ మొదలైంది. ఒక వ్యక్తి రోజు మొత్తంలో తన అవసరాల నిమిత్తం ఒక్క బకెట్ నీళ్లు మాత్రమే వినియోగించాలి. ఇదే ‘ఒన్ బకెట్' ఛాలెంజ్‌. ఇప్పటికే చెన్నై ఎదుర్కొంటున్న నీళ్ల కష్టాలు భవిష్యత్‌లో హైదరాబాద్ లాంటి నగరాల్లో రాకూడదనే కోణంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చాలెంజ్‌ స్వీకరిస్తున్నారు.

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు

జులై 21 వ తేదీన హైదరాబాద్‌లో ఉన్నవారంతా ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు తమ అవసరాల కోసం కేవలం ఒక్క బకెట్‌ వాటర్‌నే వాడాలన్నది ఈ ఛాలెంజ్‌లో కండీషన్. అయితే తాజాగా ఈ వున్న బకెట్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత ట్విట్టర్ వేదికగా ఓ సందేశం పెట్టింది.

చీట్ చేయను.. అలాంటి పనులు అస్సలు చేయను

'నాతో కలిసేది ఎవరు? వన్ బకెట్ ఛాలెంజ్. స్నానం ఎక్కువసేపు చేయడం, వాహనాలను కడగడం, ముఖం కడిగేటప్పుడు టాప్ తిప్పేసి అలాగే ఉంచడం లాంటి పనులు చేయను. నా వన్ బకెట్ ఛాలెంజ్ ఫోటోను పోస్ట్ చేస్తాను. ఇందులో చీటింగ్ అస్సలు చేయను' అని ట్వీట్ ద్వారా సమంత పేర్కొంది. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి మురిసిపోతున్నారు సమంత అభిమానులు.

చెత్త ఛాలెంజ్‌లు పక్కనబెట్టి సమంత లాంటి పనులు చేయండి

చెత్త ఛాలెంజ్‌లు పక్కనబెట్టి సమంత లాంటి పనులు చేయండి

ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఛాలెంజ్ లు వస్తుండటం చూస్తున్నాం. వాటిపై సెలబ్రిటీలు రియాక్ట్ కావడం, ఆ ఛాలెంజ్ లలో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అయితే అవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరం అనేది అందరికీ తెలుసు. కానీ వన్ బకెట్ ఛాలెంజ్ ద్వారా నీటి విలువను గుర్తించే ఛాన్స్ ఉంది. సో ఇది గమనించిన నెటిజన్లు.. 'చెత్త ఛాలెంజ్‌లు పక్కనబెట్టి సమంత లాంటి పనులు చేయండి' అని కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X