అయ్యో! సమంతకు ఏమైంది..? చర్చనీయాంశంగా మారిన ఫొటో.. రియల్లీ షాకింగ్
Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని సమంత.. పెళ్లి తర్వాత మంచి జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. చేతి నిండా సినిమాలతో పాటు అశేష అభిమాన వర్గం, తెలుగు చిత్రసీమలో గొప్పింటి ఫ్యామిలీ అన్నీ సమంత సొంతమయ్యాయి. సమంత డేట్స్ కోసం క్యూ కడుతున్నారు దర్శకనిర్మాతలు. అలాంటి సమంత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ పిక్ షేర్ చేయడంతో అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆమె అభిమానులు. ఇంతకీ ఆమె షేర్ చేసిన పిక్‌లో ఏముంది? ఎందుకా ఆశ్చర్యం? వివరాల్లోకి పోతే..

ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో సమంతను మించిన స్టార్ లేరనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా టచ్‌లో ఉంటూ తన ఫాలోయిన్ అంతకంతకూ పెంచుకుంటూ పోవడం ఆమె స్టైల్. తన వ్యక్తిగత విషయాలతో పాటు అక్కినేని కుటుంబానికి సంబందించిన అన్ని విషయాలు క్షణాల్లో నెటిజన్ల ముందుంచుతూ ఉంటుంది సామ్.

సమంత ఇన్స్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పిక్
తాజాగా సమంత తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పిక్ షేర్ చేసింది. అందులో ఆమె తల పట్టుకొని కనిపించింది. అది కూడా అస్సలు మేకప్ లేకుండా దిగాలుగా చూస్తూ నెటిజన్ల కంట పడింది. పైగా దీనికి కాస్త అనుమానాస్పదంగా ట్యాగ్‌లైన్ రాసింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.
కారణం అడగొద్దంటూ..
తాను ఇలా ఎందుకు తల పట్టుకు కుర్చున్నానని మాత్రం అడగకండి అంటూ సమంత ట్యాగ్ చేసింది. దీంతో ఈ పిక్, సమంత కామెంట్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ పిక్ గురించే జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే 'అయ్యో! ఇంతకీ సమంతకు ఏమైంది..?' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవలే స్పెయిన్ స్పెషల్ ట్రీట్
ఇదిలా ఉంటే ఇటీవలే నాగార్జున బర్త్ డే నిమిత్తం స్పెయిన్ వెళ్లిన సమంత.. అక్కడి బీచ్‌లో దిగిన ఫోటోలు, పబ్‌లో ఎంజాయ్ చేసిన వీడియోలు షేర్ చేసి మాయ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సమంత గర్బం దాల్చిందంటూ ఊహాగానాలు మిన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ సమంత షేర్ చేసిన ఈ పిక్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

సమంత 96
ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న సమంత.. ప్రస్తుతం '96' రీమేక్‌లో నటిస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తోందని సమాచారం.


Click it and Unblock the Notifications











