లండన్‌లో సమంత, చైతూ హానీమూన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
అక్టోబర్ మొదటి వారంలో ఒక్కటైన నాగచైతన్య, సమంత అక్కినేని దంపతులు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హానీమూన్ ట్రిప్‌లో భాగంగా ప్రస్తుతం వారు లండన్‌లో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. సమంత లండన్ ఉం
అక్టోబర్ మొదటి వారంలో ఒక్కటైన నాగచైతన్య, సమంత అక్కినేని దంపతులు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హానీమూన్ ట్రిప్‌లో భాగంగా ప్రస్తుతం వారు లండన్‌లో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. సమంత లండన్ ఉంటున్నట్టు తెలుపుతున్న ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
డైమండ్ రింగ్ ఫోటో
ఒక ఫొటోలో డైమండ్ రింగ్‌ను ధరించిన తన చేతిని పోస్ట్ చేసింది సమంత. మరో ఫొటోలో నాగచైతన్య ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఇన్స్‌టాగ్రామ్‌లో మంచి స్పందన లభిస్తున్నది.
గోవాలో రెండుసార్లు పెళ్లి
అక్టోబర్ మొదటి వారంలో గోవాలో నిరాడంబరంగా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం షార్ట్ ట్రిప్ కోసం లండన్‌కు వెళ్లారు. లండన్ నుంచి స్కాట్‌లాండ్‌లో పర్యటించి అక్కడి నుంచి తమ షూటింగులో పాల్గొనేందుకు ఇండియా తిరిగి వస్తారు.

డిసెంబర్‌లో మళ్లీ హానీమూన్
పెళ్లికి ముందు 40 రోజులపాటు హానీమూన్ వెళ్తున్నారు అని మీడియాలో వచ్చిన వార్తలపై సమంత స్పందించిన సంగతి తెలిసిందే. సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా పెళ్లి తర్వాత వెంటనే హానీమూన్‌కు వెళ్లమని ప్రకటించారు కూడా. అయితే డిసెంబర్‌లో పూర్తిస్థాయి హానీమూన్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

షూటింగ్స్‌లో బిజీ బిజీ
లండన్ నుంచి వచ్చిన తర్వాత నాగచైతన్య, సమంత తమ తమ షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985, మహానటి, తమిళంలో ఓ చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











