ఒరిజినల్ స్టోరీ మార్చేస్తున్నారు.. అతడితో సమంత కాలేజ్ డేస్ రొమాన్స్!
2018 తమిళ ఉత్తమ చిత్రాల్లో 96 ఒకటి. త్రిష, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రంలో ప్రేమ, ఎమోషన్, రొమాంటిక్ అంశాలు ఆడియన్స్ ని కట్టిపడేశాయి. 96 చిత్రం ఘనవిజయం సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ చిత్రం రీమేక్ కోసం పరభాషా నిర్మాతలు ఎగబడుతున్నారు. తెలుగులో ఈ చిత్ర రీమేక్ ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రీమేక్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సమంత, శర్వానంద్ జంటగా నటించబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్.

తొలి చిత్రంతోనే
96 చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకుడు. తొలి చిత్రంతోనే ప్రేమ్ కుమార్ అద్భుతాన్ని రూపొందించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొన్ని వారాల్లో వెలువడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సమంత, శర్వానంద్ జంటగా నటించబోతున్నారనే వార్త ఆసక్తిగా మారింది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది.

కథలో మార్పులు
ఒరిజినల్ స్టోరీని అదేవిధంగా దించేయకుండా తెలుగు ఆడియన్స్ కు అనుగుణంగా మార్పులు చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది దర్శకులని అనుకున్నా అవేమి కుదర్లేదు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే చిన్ననాటి సన్నివేశాలు తీసేసి.. ఆ స్థానంలో హీరో, హీరోయిన్ల మధ్య కాలేజీ రొమాన్స్ పెట్టాలని భావిస్తున్నారట.

కథకు అవసరమైన లుక్
ఈ చిత్రంలో ఎక్కువగా ప్రేమ అంశాలకు పెద్ద పీట వేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. వివిధ టైం పీరియడ్స్ లో మారే కథకు అనుగుణంగా శర్వానంద్ తన బెస్ట్ లుక్ ఇస్తాడని దిల్ రాజు భావిస్తున్నారు. సమంత, శర్వానంద్ కలసి నటించనుండడం ఇదే తొలిసారి. తమిళంలో త్రిష అద్భుత నటనకు కనబరిచింది. త్రిషకు ఏమాత్రం తగ్గకుండా సమంత నటన ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

మార్చిలో ప్రారంభం
దిల్ రాజు ఈ చిత్రాన్ని మార్చిలో ప్రారంభించాలని భావిస్తున్నారు. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆగష్టులో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం తన భర్త నాగ చైతన్య సరసన మజిలీ చిత్రంలో నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్ లో విడుదలైన శర్వానంద్ పడిపడి లేచే మనసు చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. దీనితో శర్వానంద్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











