స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపించిన నాగార్జున.. సమంత చూడండి ఎలా కామెంట్ చేసిందో!

Recommended Video

Samantha's Adorable Birthday Post For Father-In-Law Nagarjuna Akkineni || Filmibeat Telugu

అక్కినేని నాగార్జున.. ఈ సీనియర్ హీరో రోజు రోజుకూ కుర్రాడై పోతున్నాడు. హ్యాండ్సమ్ లుక్‌లో యమ క్రేజీగా దర్శనమిస్తున్నాడు. ఇటీవలే మన్మథుడు 2 సినిమాలో అయితే నాగార్జున లుక్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. జనంలో, సెలెబ్రిటీల్లో చర్చలు కూడా ఆయన లుక్ పైనే ఉన్నాయి. ఇంతలో నాగార్జున లుక్ పై సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ సమంత ఏమని కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

60వ సంవత్సరం.. కుటుంబమంతా స్పెయిన్‌లో

60వ సంవత్సరం.. కుటుంబమంతా స్పెయిన్‌లో

నాగార్జున నిన్నటితో (ఆగస్టు 29) 60వ సంవత్సరం లోకి అడుగుపెట్టారు. సాధారణంగా దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అంటారు. సో ఈ వేడుక స్పెషల్‌గా ఉండాలని అక్కినేని కుటుంబమంతా కలిసి స్పెయిన్ వెళ్ళింది.

అక్కడే పుట్టిన రోజు వేడుకలు.. ఎంజాయ్

అక్కడే పుట్టిన రోజు వేడుకలు.. ఎంజాయ్

నిజానికి నాగార్జున పుట్టిన రోజు వేడుకలను స్పెయిన్ లోనే ప్లాన్ చేశారని తెలిసింది. పుట్టిన రోజు వేడుకలను ఎంతో స్పెషల్‌గా చేయాలని నాగచైతన్య, సమంత, అఖిల్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ ఈ వేడుకలకు సంబందించిన వివరాలు మాత్రం అఫీషియల్‌గా బయటకు రాలేదు. స్పెయిన్ లో అక్కినేని కుటుంబం ఎంజాయ్ చేసిన తాలూకు ఫోటోలు మాత్రం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపుతూ నాగ్

స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపుతూ నాగ్

ఈ నేపథ్యంలో సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్విమ్మింగ్ పూల్‌లో కండలు చూపుతూ నాగార్జున దిగిన ఓ పిక్ షేర్ చేసింది. ఈ పిక్‌లో షర్ట్ లేకుండా కనిపిస్తున్నారు నాగార్జున. పైగా ఈ పిక్ పై అక్కినేని కోడలు సమంత ఓ కామెంట్ కూడా చేసింది. ప్రస్తుతం ఆ పిక్, కామెంట్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

మీరు జయించారు మామా

''ప్రతి ఒక్కరూ మీ నుంచి కోరుకునేది ఇదే. మీ ఆనందమే మీ ఆరోగ్యం. అందుకే ఇలా ఉన్నారు. మీ చుట్టూ ఉండటం నేను గమనించింది అదే. మీ అందమైన మనస్సు, సృజనాత్మకతతో మీరు వయసును జయించారు మామా'' అంటూ కామెంట్ పెట్టింది సమంత.

 కుటుంబమంతా వారం రోజుల పాటు అక్కడే

కుటుంబమంతా వారం రోజుల పాటు అక్కడే

ప్రస్తుతం నాగార్జున సహా అక్కినేని కుటుంబమంతా స్పెయిన్ లోనే ఎంజాయ్ చేస్తోంది. సుమారు వారం రోజులపాటు నాగార్జున తన కుటుంబ సభ్యులతో స్పెయిన్‌లోనే ఉండనున్నారని సమాచారం. సెప్టెంబర్ 6న నాగార్జున దంపతులు ఇండియాకు తిరిగొస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X