నా ఫెర్ఫార్మెన్స్ బాగుందంటే.. ఆయన డైలాగ్సే కారణం.. లక్ష్మీభూపాల్‌కు సమంత ప్రశంసలు

టాలీవుడ్ హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత కెరీర్ తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా సమంత మీడియాతో ముచ్చటించారు. ఓ బేబీ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

ఓ బేబీలోని నా పాత్ర పూర్తిగా ఛాలెంజింగ్‌తో కూడుకొన్నది. చూడటానికి 70 ఏళ్లుగా కనిపిస్తుంది కానీ.. 24 ఏళ్ల వయసు అమ్మాయి ప్రవర్తనలా ఉంటుంది. ఇక నా ఫెర్మార్మెన్స్ బాగా ఉండటానికి కారణం డైలాగ్స్, గోదావరి యాస. భాష వల్లనే నా పాత్ర పూర్తిగా ఎలివేట్ అయిందని భావిస్తాను. మీరు కూడా చూస్తే కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అందుకు రైటర్ లక్ష్మీ భూపాల్‌ను అభినందించాలి. ఆయన రాసిన మాటలు, సాహిత్యం చాలా బాగుంది. ఈ సినిమాకు ఆయనే ఫిల్లర్ అని సమంత ప్రశంసల వర్షం కురిపించింది.

 Samantha Akkineni showers on Laxmi Bhopal dialogues

ఓ బేబీ చిత్రంలో నా పాత్ర ఏది మాట్లాడినా.. ముందో.. వెనుకో సామెతలను కలిపి మాట్లాడుతుంటుంది. పాత, కొత్త సామెతలను జాగ్రత్తగా డైలాగ్స్‌లో పెట్టడం లక్ష్మీ భూపాల్ టాలెంట్‌ వల్లనే సాధ్యమైంది. ఈ సినిమాలో నా పాత్ర గలీజ్ క్యారెక్టర్. చూడటానికి మోడరన్‌గా కనిపిస్తాను. నోరు తెరిస్తే బూతులే వస్తాయి. సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది అని సమంత చెప్పింది.

జూలై 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X