మొన్న సీక్రెట్ ప్లేస్‌లో.. నేడు అందరికీ కనిపించేలా.. హాట్ టాపిక్ అవుతున్న సమంత టాటూస్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న భామ ఎవరంటే అది అక్కినేని సమంతనే అని చెప్పుకోవచ్చు. పెళ్లి చేసుకొని అక్కినేని కోడలిగా అత్తారింట అడుగుపెట్టిన ఈమె గత రెండేళ్లుగా వెండితెర జోష్ కొనసాగిస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే..

సీక్రెట్ ప్లేస్‌లో భర్త పేరుతో టాటూ

సీక్రెట్ ప్లేస్‌లో భర్త పేరుతో టాటూ

ఇటీవలే సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటో ద్వారా ఇప్పటి వరకు ఎవరి కంటా పడని ఓ టాటూను చూపించిన సంగతి తెలిసిందే. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చింది సమంత. ''ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం'' అంటూ అప్పుడు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది సామ్.

నాగార్జున పుట్టినరోజు నిమిత్తం పొరుగు దేశంలో సమంత

నాగార్జున పుట్టినరోజు నిమిత్తం పొరుగు దేశంలో సమంత

గత వారం నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌, అక్కడ దిగిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది.

నేడు అందరికీ కనిపించేలా..

నేడు అందరికీ కనిపించేలా..

ఈ మేరకు సమంత షేర్ చేసిన ఓ పిక్ నెట్టింట సెన్సేషన్‌‌గా మారింది. ఈ పిక్ లో బీచ్ ఒడ్డున ఉన్న సమంత తన వీపుపై ఉన్న టాటూను అందరికీ చూపిస్తూ ఫోటోకి ఫోజిచ్చింది. పైగా ఆ పిక్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో అటు ఆమె అభిమానులు, ఇటు నెటిజన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో కొద్ది సేపట్లోనే ఈ ఫొటో నెట్టింట హాట్ టాపిక్ అయింది. దీనిని అనుకూలంగా కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లయ్యాక కూడా ఇలా అన్నీ బయటపెట్టేయడం ఏంటంటూ ట్రోల్ చేస్తున్నారు.

మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

మజిలీ, ఓ బేబీ రూపంలో వరుస హిట్స్

గతేడాది వరుస విజయాలతో దూసుకుపోయిన సామ్.. ఈ ఏడాది కూడా అదే రేంజ్ కొనసాగిస్తోంది. ఇటీవలే భర్తతో కలిసి మజిలీ రూపంలో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆ వెంటనే ఓ బేబీ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తాను మెప్పించగలను అని నిరూపించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సమంత కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా

టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్తగా

ఇకపోతే సమంత టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుందనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్‌గా ఉండే ఈమె ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కమిట్ అయ్యిందట. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరగటం కారణంగా సమంత ఇటువైపుగా ఆలోచనలు చేస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X