Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లైంగిక ఆరోపణల విషయమై చిన్మయికి సమంత సపోర్ట్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుగా చిన్మయి అందరికీ సుపరిచితమే. పైగా ఆమె సమంతకు క్లోజ్ ఫ్రెండ్ కావడం, ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, ఈవెంట్లకు వెళ్తుండటం మూలంగా చాలా ఫేమస్ అయ్యారు. అయితే కొద్దికాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్ విషయమై ఘాటుగా స్పందించడం కారణంగా చిన్మయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన సమంత.. చిన్మయికి తన మద్దతు తెలిపింది. వివరాల్లోకిపోతే..
'మీటూ' ఉద్యమం.. వైరాముత్తుపై ఆరోపణలు
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను ఖండిస్తూ మొదలైన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉద్యమంలో భాగంగా పెదవి విప్పిన గాయని చిన్మయి.. ప్రముఖ సాహిత్య రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు గుప్పించింది. ఆ సమయంలో చిన్మయికి సమంత తన మద్దతు ప్రకటించింది. అయితే వైరముత్తుపై చేసిన ఆరోపణల కారణంగా క్రమంగా చిన్మయికి అవకాశాలు తగ్గిపోయాయి.
రాధారవిపై విరుచుకుపడుతూ
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై చర్య తీసుకోవాలని చిన్మయి బలంగా వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి లైంగిక ఆరోపణలు చేసింది. అయితే ఆ తర్వాత చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్మయి స్నేహితురాలు సమంత మరోసారి ఆమెకు అండగా నిలుస్తూ మద్దతు తెలిపింది.
లైంగిక ఆరోపణలు చేసి నిందల పాలైంది
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. చిన్మయి అవమానాలు ఎదుర్కొంటోందని తెలిపింది. నిజాలు బయట పెట్టాలంటే ధైర్యం ఉండాలని, ఆ దైర్యం చిన్మయిలో ఉందని పేర్కొంది సామ్. లైంగిక వేధింపులకు సంబందించిన నిజాలు బయటపెట్టినందుకు ఆమె పై విమర్శలు గుప్పించడం సరికాదని సమంత తెలిపింది. ఎలాంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని సమంత చెప్పుకొచ్చింది.
ఓ బేబీ సమంత
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిన్మయి మరోసారి డబ్బింగ్ చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది సమంత.