twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక ఆరోపణల విషయమై చిన్మయికి సమంత సపోర్ట్

    |

    టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుగా చిన్మయి అందరికీ సుపరిచితమే. పైగా ఆమె సమంతకు క్లోజ్ ఫ్రెండ్ కావడం, ఈ ఇద్దరూ కలిసి పార్టీలు, ఈవెంట్లకు వెళ్తుండటం మూలంగా చాలా ఫేమస్ అయ్యారు. అయితే కొద్దికాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్ విషయమై ఘాటుగా స్పందించడం కారణంగా చిన్మయి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన సమంత.. చిన్మయికి తన మద్దతు తెలిపింది. వివరాల్లోకిపోతే..

    'మీటూ' ఉద్యమం.. వైరాముత్తుపై ఆరోపణలు

    'మీటూ' ఉద్యమం.. వైరాముత్తుపై ఆరోపణలు

    మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను ఖండిస్తూ మొదలైన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉద్యమంలో భాగంగా పెదవి విప్పిన గాయని చిన్మయి.. ప్రముఖ సాహిత్య రచయిత వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు గుప్పించింది. ఆ స‌మ‌యంలో చిన్మ‌యికి స‌మంత తన మ‌ద్ద‌తు ప్రకటించింది. అయితే వైర‌ముత్తుపై చేసిన ఆరోప‌ణ‌ల కారణంగా క్రమంగా చిన్మ‌యికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

     రాధారవిపై విరుచుకుపడుతూ

    రాధారవిపై విరుచుకుపడుతూ

    మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై చర్య తీసుకోవాలని చిన్మయి బలంగా వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మ‌యి లైంగిక ఆరోపణలు చేసింది. అయితే ఆ తర్వాత చిన్మయిని డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్మయి స్నేహితురాలు సమంత మరోసారి ఆమెకు అండగా నిలుస్తూ మద్దతు తెలిపింది.

    లైంగిక ఆరోపణలు చేసి నిందల పాలైంది

    లైంగిక ఆరోపణలు చేసి నిందల పాలైంది

    తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత.. చిన్మయి అవమానాలు ఎదుర్కొంటోందని తెలిపింది. నిజాలు బయట పెట్టాలంటే ధైర్యం ఉండాలని, ఆ దైర్యం చిన్మయిలో ఉందని పేర్కొంది సామ్. లైంగిక వేధింపులకు సంబందించిన నిజాలు బయటపెట్టినందుకు ఆమె పై విమర్శలు గుప్పించడం సరికాదని సమంత తెలిపింది. ఎలాంటి తప్పు చేయని ఓ వ్యక్తి ఇలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని సమంత చెప్పుకొచ్చింది.

    ఓ బేబీ సమంత

    ఓ బేబీ సమంత

    అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో చిన్మయి మరోసారి డబ్బింగ్ చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది సమంత.

    English summary
    Samantha Akkineni supports dabbing artist Chinmayi in #MeeTo issue. She said Chinmayi fighting on womens sexual harassment is great thing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X