twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Family Man 2 Trailer: భయంకరమైన ఉగ్రవాదిగా సమంత.. ఈసారి అంతకు మించి!

    |

    ఆమెజాన్ ప్రైమ్ లో మునుపెన్నడూ లేని విదంగా మంచి క్రేజ్ అందుకున్న టాప్ ఇండియన్ వెబ్ సిరీస్ లలో ద ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దేశవ్యాప్తంగా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సీజన్ 2ను రెడీ చేశారు. అన్ని భాషల్లో కూడా ఈ వెబ్ కంటెంట్ కు మంచి ఆదరణ దక్కింది. ఇక ద ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం అభిమానుల ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభం కార్డ్ వేయబోతున్నారు. ఈసారి సమంత ఒక టెర్రరిస్ట్ గా కనిపిస్తుండడంతో అంచనాల డోస్ కూడా పెరిగింది. ఇక మొత్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

    అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా

    అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా

    ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా దర్శకులు రాజ్ అండ్ డీకే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    మనోజ్‌ బాజ్‌పాయ్‌ మెయిన్ లీడ్ లో నటించగా ప్రియమణి హౌజ్ వైఫ్ పాత్రలో మెప్పిస్తోంది. తీవ్రవాదులు, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ల మధ్య జరిగే సీన్స్ ఆడిరిపోయాయి. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలెట్ గా నిలిచాయి...

    రాజీ ఎంట్రీతో..

    రాజీ ఎంట్రీతో..

    శ్రీకాంత్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) ఒక ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గా కొనసాగిన అనంతరం సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ లో కొనసాగుతూ ఉంటాడు. కానీ అతని ఆలోచన మొత్తం క్రైమ్ ఆపరేషన్స్ వైపే ఉంటుంది. ఇంటెలిజెన్స్‌ లో వర్క్ చేసే సన్నిహితుల ద్వారా ఎప్పటికప్పుడు క్రైమ్ అపరేషన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే రాజీ ఎంట్రీతో కథ మారిపోతుంది.

     ఉగ్రవాదిగా సమంత

    ఉగ్రవాదిగా సమంత

    రాజీ అనే ఉగ్రవాదిగా కనిపించిన సమంత ఈసారి నెవర్ బిఫోర్ అనేలా ఆకట్టుకోవడం కాయమని తెలుస్తోంది. ఉగ్రవాదిగా బీభత్సం సృష్టించాలనే ఆపరేషన్ మీద చెన్నైలో అడుగు పెడుతుంది. అనంతరం మనోజ్ ఆమెను ఎలా అడ్డుకున్నారు అనేది అసలైన పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కూడా హై రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

    రిలీజ్ ఎప్పుడంటే..

    రిలీజ్ ఎప్పుడంటే..

    తెలుగు దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కించిన ఈ వెబ్ కంటెంట్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలతో దర్శకులు ప్రమోషన్ బాగానే చేస్తున్నారు. అయితే ఈసారి సీజన్ 2ను తెలివిగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ సీజన్ 2 ఎపిసోడ్స్ ను మాత్రం ఒకేసారి రిలీజ్ చేయకుండా వారానికోక ఎపిసోడ్ ను విడుదల చేయనున్నారట. తప్పకుండా సీజన్ 2 క్లిక్కవుతుందని అమెజాన్ ప్రైమ్ గ్యాప్ లేకుండా ప్రమోషన్ డోస్ పెంచుతోంది.

    English summary
    The Family Man is one of the most viewed web series on Amazon Prime. The Family Man 2 makers might release one episode per week. Directed by Telugu directors Raj & DK, this web content has received a good response from audiences from all walks of life. Manoj Bajpayee and Priyamani starrer Season 2 is getting ready for season 2 with a huge response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X