మామ కోసం సమంత అలా.. బర్త్ డే మరింత స్పెషల్!!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో మాత్రం ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డేను, అడ్వాన్స్ బర్త్ డే, కామన్ డీపీలు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీటిల్లో వరల్డ్ రికార్డులు కొట్టాలని ఫ్యాన్స్ తహతహలాడుతుంటారు. అందులో భాగంగానే ఈ మధ్య పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. మహేష్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ రికార్డులు క్రియేట్ చేయగా వాటిని పవన్ ఫ్యాన్స్ లేపేశారు.
ఇక రాబోయేది మెగా ఫ్యాన్స్ టైం. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఇప్పటికే భారీ స్కెచ్ వేశారు. దేశ వ్యాప్తంగా 65 మంది సెలెబ్రిటీలతో కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీల్లోని టాప్ హీరోలతో రిలీజ్ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కింగ్ నాగార్జున బర్త్ డే సందడి మొదలైంది.

సోషల్ మీడియా నాగ్ బర్త్ డే హల్చల్ సమంతతో మొదలు కాబోతోందని ప్రకటించారు. నాగ్ బర్త్ డే కామన్ డీపీని సమంత రిలీజ్ చేయబోతోన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆగస్ట్ 23న సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయబోతోన్నట్టు ట్వీట్ చేశారు. మొత్తానికి మామ బర్త్ డేను సమంత చేతుల మీదుగా ప్రారంభించబోతోన్నారు. ఇక ముద్దుల మామకు కోడలిచ్చే బహుమతి ఎలా ఉంటుందో చూడాలి. ఇక నాగ్ బర్త్ డే రోజునే బిగ్ బాస్ ప్రారంభం కాబోతోందనే వాదన కూడా ఒకటి నడుస్తోంది.


Click it and Unblock the Notifications











