యూర్ లైఫ్.. ఉపాసన కోసం వంట చేసిన అక్కినేని సమంత

రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల ఎలాంటి పనులు చేసినా కూడా అందులో ఎదో ఒక మంచి సందేశం ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆరోగ్య విషయంలో ఆమె ఇచ్చే సలహాలు చాలా వరకు సోషల్ మీడియా నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంటుంది. లాక్ డౌన్ లో ఆమె చా రకాల హెల్త్ టిప్స్ గురించి చెప్పారు. వాటికి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆమె ఏకంగా ఒక వెబ్ సైట్ ని స్టార్ట్ చేశారు.

అందరూ ఆరోగ్యంగా ఉండలనే ఆలోచనతో ఆమె స్టార్ట్ చేసిన ఆ యూర్ లైఫ్ అనే వెబ్ సైట్ కి సమంత కూడా మద్దతు పలికింది. ప్రకృతి పరంగా కొనసాగే జీవితం చాలా మంచిదని, సంపూర్ణ ఆరోగ్యం యొక్క సిద్ధాంతాలు జనాలకు చేరువయ్యేలా ఉపాసన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇక గెస్ట్ ఎడిటర్ గా సమంత పేరును ప్రకటించారు. ఉపాసనతో కలిసి సమంత మొదటి సారి 'తక్కిలి సదం' వంటకాన్ని తయారు చేశారు. రేసిపిని ఎలా చేయాలో ఆ వీడియోలో చాలా క్లియర్ గా చూపించారు.

Samantha akkineni upasana konidela new dish video viral

ఇక ఇద్దరు స్టార్ సెలబ్రెటీలు సరదాగా అలా కూకింగ్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతంలో సమంత అర్బన్ ఫామింగ్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు, అలాగే తినే ఆహారం విషయంలో కూడా ఎంతవరకు శ్రద్దా తీసుకోవాలనే దానిపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఉపాసనతో కలిసి చేసిన వంటకం కూడా జనాలకు ఉపయోగపడే విధంగా ఉండడంతో నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X